Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. పుష్ప సినిమాతో ఎంతో సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకు గాను ఈయనకు ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఈ అవార్డు అందుకున్నటువంటి తొలి టాలీవుడ్ హీరోగా అల్లు అర్జున్ రికార్డు సొంతం చేసుకున్నాడు.
ఇక ఈయనకు ఈ అవార్డు రావడంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది నిజానికి ఈ నామినేషన్స్ లో అల్లు అర్జున్ తో పాటు రామ్ చరణ్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. తప్పకుండా వీరిద్దరిలో ఎవరికో ఒకరికి ఈ అవార్డు వస్తుందని అందరూ భావించారు కానీ ఈ అవార్డు అల్లు అర్జున్ కి రావడంతో డబ్బులు ఇచ్చి మరి అల్లు అర్జున్ ఈ అవార్డు కొనుగోలు చేశారు అంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ అవార్డు ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ కు మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ అల్లు అర్జున్ కొనుగోలు చేశారు అంటూ విమర్శలు చేస్తున్నారు.
Allu Arjun:
ఇక ఈ విమర్శలపై అల్లు అర్జున్ అభిమానులు స్పందిస్తూ పుష్పా సినిమాని చూస్తే ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో స్పష్టంగా అర్థం అవుతుంది. ఆయన కష్టాలకు తగ్గ ఫలితమే ఈ అవార్డు అంటూ విమర్శలను తిప్పికొడుతున్నారు. ఇదిలా ఉండగా ఈ అవార్డు వచ్చిన అనంతరం అల్లు అర్జున్ పలు ఇంటర్వ్యూలలో హాజరవుతున్నారు. ఈ ఇంటర్వ్యూలలో భాగంగా ఆయనకు మెగా సపోర్ట్ అవసరం లేదని.. మెగా కాంపౌండ్ నుంచి వచ్చే ఎటువంటి బ్యాక్ సపోర్ట్ తో ఆయనకి పనిలేదని చెప్పకనే చెప్పేసారంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారు దీంతో నేషనల్ అవార్డు రావడంతోనే అంత హెడ్ వెయిట్ అయితే ఎలాగ బన్నీ మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేనిదే నువ్వు ఈ స్థాయికి వచ్చావా అంటూ పలువురు ఈ వ్యాఖ్యలపై విమర్శలు కురిపిస్తున్నారు.