Allu Arha: స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుందనే వార్తలు సినీ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కూతురుగా అల్లు అర్హ చిన్న వయస్సులోనే పాపులర్ అయింది. తన కుమార్తె వీడియోలను అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఎప్పుడూ షేర్ చేస్తూ ఉంటారు. క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్ తో, ముద్దుముద్దు మాటలతో కూడిన వీడియోలను అల్లు అర్జున్ తన సోషల్ మీడియాలో అకౌంట్లలో పోస్ట్ చేస్తూ ఉంటారు.
అల్లు అర్హ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటుంది. దీని వల్ల చిన్న వయస్సుల్లోనే అల్లు అర్హ పాపులర్ అయింది. అయతే అల్లు అర్జున భార్య స్నేహ త్వరలో హీరోయిన్ గా మారనుందనే వార్తలు జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సోషల్ మీడియాలో ఫొటోషూట్లకు సంబంధించిన ఫొటోలను స్నేహా అప్ లోడ్ చేస్తోంది. దీంతో ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందనే ప్రచారం జరుగుతోంది.
అయితే ఇప్పుడు అల్లు అర్హ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన శాకుంతలం సినిమాలో అల్లు అర్హ నటించగా,. త్వరలో మరో సినిమాలో అల్లు అర్హ నటించనుందట. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో అల్లు అర్హ నటించనుందనే ప్రచారం జరుగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలలో అల్లు అర్హ కనిపించనుందట.
Allu Arha:
ఈ సినిమాలో మహేష్ సరసర పూజాహెగ్దే హీరోయిన్ గా నటించనుంది. ఈ సినిమాలో పూజాహెగ్దే చిన్నప్పటి పాత్రలో అల్లు అర్హ నటించనుందని చెబుతున్నారు. ఈ వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. త్రివిక్రమ్ తో సినిమా పూర్తయిన తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించనున్న సినిమాలో మహేష్ బాబు నటించనున్నాడు.