Allu Bobby: అల్లు అర్జున్ అన్నకు అలాంటి దుస్థిత.. రెస్టారెంట్ లో ప్లేట్లు కడిగే పరిస్థిత?

Akashavani

Allu Bobby: టాలీవుడ్ ప్రేక్షకులకు అల్లు బాబీ అంతగా పరిచయం లేకపోవచ్చు. కానీ అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అంటే ఎవరైనా ఇట్టే గుర్తుపడతారు. బాబి పలు సినిమాల్లో నటుడిగా.. నిర్మాతగా తెలుగు ప్రేక్షకులకు కొంతవరకు పరిచయమయ్యాడు. ఇక బాబీ సొంతంగా హైదరాబాదులో ప్రొడక్షన్ హౌస్ కూడా నిర్మించుకున్నాడు.

మొత్తానికి అల్లు ఫ్యామిలీ లో బాబి కూడా బిజినెస్ పరంగా ఒక మెట్టు పైనే ఉన్నాడు. ఇక ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగే పలు ఈవెంట్లకు బాబీ కూడా హాజరయ్యేవాడు. ఇక ప్రస్తుతం బాబి.. సాయి వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమాకు నిర్మాతగా చేస్తూ ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో హడావిడి చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే బాబీ గతంలో ఒక రెస్టారెంట్లో నేను ప్లేట్లు కడిగాను అని. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసాడు. అసలు బాబీ ప్లేట్లు కడగటం ఏమిటి? మరి వాటి వెనకాల ఉన్న కారణాలేమిటో.. ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇటీవల గని సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ముచ్చటించాడు బాబి. తాను ప్లేట్లు కడిగిన ఒకప్పటి విషయం గురించి జర్నలిస్ట్ అడిగాడు. దానికి బాబీ ఏమాత్రం సిగ్గుపడకుండా 1994 లొ నేను ఆస్ట్రేలియా వెళ్లానని అక్కడ 17 సంవత్సరాల వయసులో సరదాగా ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ అక్కడే చదువుకునే వాడినని తెలిపాడు.

Allu Bobby: అల్లు అర్జున్ అన్నకు అలాంటి దుస్థిత.. రెస్టారెంట్ లో ప్లేట్లు కడిగే పరిస్థిత?
Allu Bobby: అల్లు అర్జున్ అన్నకు అలాంటి దుస్థిత.. రెస్టారెంట్ లో ప్లేట్లు కడిగే పరిస్థిత?

Allu Bobby: అల్లు బాబీ రెస్టారెంట్లో ప్లేట్లు కడగడానికి కారణం ఇదే!

అక్కడ చదువుకోవడం తో పాటు.. ఏదో ఒక పని చేసుకోవడానికి కూడా కొంత ఖాళీ సమయం ఉండేదని బాబీ చెప్పుకొచ్చాడు. ఇక తనకు ఒక రెస్టారెంట్లో వెయిటర్ గా అవకాశం వచ్చిందని ఇక దాని కోసం అతడు రెస్టారెంట్ కి వెళ్లగా ముందుగా ప్లేట్లు కడగడం నేర్చుకోమని చెప్పారని అల్లు బాబి ఆ మీడియా తో నిర్మొహమాటంగా చెప్పేశాడు. ప్రస్తుతం అల్లు బాబీ మీడియాతో పంచుకున్న ఈ మాటలు యూట్యూబ్ లో వైరల్ గా మారాయి.

- Advertisement -