Allu Bobby: ఆ సినిమా ప్లాఫ్ తో అల్లు అర్జున్ లో మార్పు వచ్చింది.. అల్లు బాబీ

Akashavani

Allu Bobby: తెలుగు ప్రపంచానికి అల్లు అర్జున్ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. గంగోత్రి సినిమా ద్వారా హీరోగా పరిచయమైన బన్నీ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ఇక ఈయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలలో తాను ఒకటిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇటీవల సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ద్వారా అల్లు అర్జున్ క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి ఎగబాకింది. ఇక సినిమా అంతా ఒక ఎత్తు అయితే.. అందులో బన్నీ చిత్తూరు యాస మరో ఎత్తు అని చెప్పవచ్చు. ఇదంతా పక్కన పెడితే అరవింద్ ముగ్గురు కొడుకుల్లో ఒకరు అల్లు బాబీ మనకు తెలుసు.

బాబి పలు సినిమాలకు నిర్మాతగా వహించాడు. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గని సినిమాకు నిర్మాత బాధ్యతలు చేపట్టాడు. ఇక ఈ చిత్రం ప్రమోషన్ లో నేపథ్యంలో బాబీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని బన్నీ కెరీర్లో అన్ సాటిస్ఫై చేసిన ఒక సినిమా గురించి వివరించాడు.

Allu Bobby: ఆ సినిమా ప్లాఫ్ తో అల్లు అర్జున్ లో మార్పు వచ్చింది.. అల్లు బాబీ
Allu Bobby: ఆ సినిమా ప్లాఫ్ తో అల్లు అర్జున్ లో మార్పు వచ్చింది.. అల్లు బాబీ

Allu Bobby: బన్నీ ఆత్మపరిశీలన చేసుకోవడానికి కారణమైన సినిమా ఇదే!

ఈ క్రమంలో అల్లు బాబీ మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ఎన్నో సినిమాలు చేస్తూ ఉంటాడు. కానీ నా పేరు సూర్య సినిమా పైబన్నీ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ అది ఫ్లాప్ కావడంతో బన్నీ దాదాపు రెండు సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇక ఆ సినిమాతోనే బన్నీ తన ఆత్మ పరిశీలన చేసుకున్నాడని అల్లు బాబీ తన తమ్ముడు అల్లు అర్జున్ గురించి చెప్పుకొచ్చాడు.

ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అల్లు బాబి నిర్మాతగా వస్తున్న గని సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి. అంతేకాకుండా గని సినిమాలో హీరో గా డిఫరెంట్ రోల్ చేస్తున్న వరుణ్ తేజ్ స్క్రీన్ పై ఏ విధంగా కనిపిస్తాడో చూడాలి.

- Advertisement -