Amalapaul: నటి అమలాపాల్ తాజాగా రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈమె మొదట తమిళ దర్శకుడు విజయ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలం పాటు ఆయనతో సంతోషంగా ఉన్నటువంటి ఈమె అనంతరం విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకులు తీసుకొని విడిపోయినటువంటి అమలాపాల్ కొంతకాలం పాటు ఒంటరిగా ఉంటూ కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం రెండవ వివాహం చేసుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి జగత్ దేశాయ్ అనే వ్యక్తిని అమలాపాల్ రెండవ వివాహం చేసుకున్నారు.
తన ప్రియుడిని పరిచయం చేసిన పది రోజుల వ్యవధిలోనే ఈమె రెండవ వివాహం చేసుకొని అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఈమె పెళ్లి చేసుకున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అతని బ్యాగ్రౌండ్ ఏంటి అని పెద్ద ఎత్తున ఆరా తీయడం మొదలు పెట్టారు. జగత్ దేశాయ్ ప్రముఖ వ్యాపారవేత్త అని తెలుస్తుంది. దేశంలోనే టాప్ బిజినెస్ మెన్ లలో ఈయన కూడా ఒకరు. తల్లిదండ్రులకు ఈయన ఒక్కడే వారసుడు కావడం విశేషం. ఇక ఈయన పేరు మీదట ఎన్నో కంపెనీలు వ్యాపారాలు ఉన్నాయి ఈయన కొన్ని వేల కోట్లకు అధిపతి అనే విషయం తెలుస్తుంది.
సౌండ్ పార్టీని పట్టేసిన అమలాపాల్…
ఈ విధంగా జగత్ దేశాయ్ వేల కోట్లకు అధిపతి అనే విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇలాంటి భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి అమలాపాల్ కు ఎలా పరిచయమయ్యారు అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈమె రెండో వివాహం చేసుకున్నప్పటికీ మంచి సౌండ్ పార్టీని చూసే పెళ్లి చేసుకున్నారు అంటూ ఈమె వివాహం గురించి తన రెండో భర్త గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.