Amani: సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటి ఆమని ఒకరు.ఈమె సౌందర్య రమ్యకృష్ణ రాశి వంటి హీరోయిన్లతో పాటు అప్పట్లో వరుస సినిమా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.అయితే పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరమైనటువంటి ఆమని ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాల ద్వారా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఇంటర్వ్యూ సందర్భంగా ఆమని ఇండస్ట్రీలో ఉన్నటువంటి క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎప్పటి నుంచో ఉందని తెలిపారు అయితే అప్పట్లో సోషల్ మీడియా ఇంతగా డెవలప్ కాకపోవడంతో ఈ విషయం ఎవరికీ తెలియదని ఈమె తెలియజేశారు. ఇక తన విషయంలో కూడా ఎదురైనటువంటి చేదు అనుభవాలను ఈ సందర్భంగా ఆమని తెలియజేశారు. అయితే తమిళ చిత్ర పరిశ్రమలో నాకి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందని ఈమె తెలిపారు. ఓ సినిమా షూటింగ్లో భాగంగా స్విమ్మింగ్ పూల్ సన్నివేశం చేయాల్సి ఉంది. అయితే సీన్ చేయడం కోసం ఒంటిపై బట్టలు తీసేయమని చెప్పారు.
Amani:
ఈ సీజ్ చేయడం కోసం మీ వంటిపై ఏవైనా స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయేమో చూడాలి బట్టలు తీయమంటూ నన్ను అడిగారు దీంతో వెంటనే తాను ఒప్పుకోలేదు ఇలాంటి వారు అలాంటి వాటి కోసమే వస్తారు..నేను ఇలాంటి వాటికి అసలు ఒప్పుకునేదాన్ని కాదని అలాంటి క్యారెక్టర్స్ తాను చేయనని నిర్మహమాటంగా చెప్పేదానినని ఈ సందర్భంగా ఆమని తెలియజేశారు.ఇలాంటి విషయాలు పూర్తిగా హీరోయిన్ల వ్యక్తిగత నిర్ణయం అని మనం ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు అంటూ ఈ సందర్భంగా ఆమని కాస్టింగ్ కౌచ్ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.