Amar Deep: బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ప్రసారం అవుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి వారిలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి.ఈ కార్యక్రమం ఇప్పటికే పలు భాషలలో ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇకపోతే తెలుగులో ఈ కార్యక్రమం ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఏడవ సీజన్ కూడా ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.ఇలా ఏడవ సీజన్లో పాల్గొనడం కోసం నిర్వాహకులు ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను కూడా మొదలు పెట్టారని సమాచారం.
ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలోకి బుల్లితెర నటుడు అమర్ దీప్ పాల్గొనబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే అప్పుడే ఈయన పెళ్లి కూడా జరుగుతున్న నేపథ్యంలో తాను ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే తాజాగా ప్రసారం కాబోయే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఈయన పాల్గొనబోతున్నారు అంటూ మరోసారి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై నటుడు అమర్ దీప్ స్పందించారు.
Amar Deep: స్టార్ మా చానల్ వారి ఇష్టం…
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అమర్ దీప్ కి ఇదే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ…నాకు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అవకాశం వచ్చిందనే వార్తలు నేను కూడా చూశానని తెలిపారు. అయితే నేను ఈ కార్యక్రమంలో పాల్గొనాల లేదా అన్నది మా ఛానల్ (స్టార్ మా) వారి ఇష్టమని ఈయన తెలియజేశారు. ప్రస్తుతం తాను వరుస సీరియల్ తో ఎంతో బిజీగా ఉన్నానని నేను బిగ్ బాస్ కు వెళ్లడం అనేది వారి నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుందని ఈయన తెలియచేశారు మరి స్టార్ మా చానల్ తనని బిగ్ బాస్ కార్యక్రమానికి పంపిస్తుందో లేదో వేచి చూడాల్సిందేనని ఈ సందర్భంగా అమర్ దీప్ తెలియచేయడంతో ఈయన వెళ్లడం లేదని క్లారిటీ ఇవ్వకుండా స్టార్ మా చానల్ వారి ఇష్టమని చెప్పడంతో ఈయన వెళ్లే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని తెలుస్తుంది.