Amar Deep: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కొనసాగుతున్నటువంటి అమర్ దీప్ ఈ మధ్యకాలంలో అద్భుతమైన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అమర్ ఆట తీరు చూస్తుంటే ఈయన కూడా తప్పకుండా టాప్ 5 లో ఉంటారు అనడంలో సందేహం లేదు. అయితే ఈ వారం కెప్టెన్సీ టాస్కులలో భాగంగా బిగ్ బాస్ ఇచ్చినటువంటి టాస్కులో అమర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తూ వచ్చారు. అయితే అమర్ ఉన్నఫలంగా కళ్ళు తిరిగి పడిపోయారు. ఇలా హౌస్ లో ఉన్నటువంటి ఈయన అస్వస్థతకు గురి కావడంతో వెంటనే కంటెస్టెంట్లు ఆయనని మెడికల్ రూమ్ కి తరలించారు.

ఇలా మెడికల్ రూమ్ కి వెళ్ళినటువంటి అమర్ కు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందించారని తెలుస్తుంది. అయితే ఈయన డిహైడ్రేషన్ కి గురికావడం వల్లే కళ్ళు తిరిగి పడిపోయారని తెలుస్తోంది. అందుకే మెడికల్ రూమ్ లో డాక్టర్స్ ఆయనకు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇస్తూ సెలైన్స్ కూడా ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తుంది. కేవలం డిహైడ్రేషన్ కి గురి అయిన కారణంగానే కళ్ళు తిరిగి పడిపోయారని భయపడాల్సిన పని లేదంటూ డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తుంది.

స్థిమితంగా అమర్ ఆరోగ్యం…

ఇక అమర్ కాస్త కోలుకోవడంతో తిరిగి హౌస్ మెట్ల తో కలిసి కూర్చొని మాట్లాడుతున్నారు. ఇందుకు సంబంధించిన ఈ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాబోతుంది అని తెలుస్తుంది. అయితే ఉన్నఫలంగా అనారోగ్యానికి గురయ్యారు అనే వార్త తెలియడంతో తన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా కాస్త కంగారుపడ్డారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి బాగుందని డిహైడ్రేషన్ వల్ల అలా పడిపోయారని తెలియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

AkashavaniEditor

Hai I'm Akashavani, Film Journalist. I breathe and live entertainment. I love to watch serials and films from childhood-now I get paid for it. I worked in a few top media houses such as News18 Telugu,...

Mail

Published on నవంబర్ 23, 2023 at 1:55 సా.