Amyra Dastur బికినీ లో హీట్ పెంచేసిన యంగ్ హీరోయిన్.. ఆగడం కష్టమే…

Joythi R

Amyra Dastur అమైరా దస్తూర్ ఈ పేరు వింటే తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్ట లేకపోయినప్పటికీ బాలీవుడ్ వాళ్ళు మాత్రం ఠక్కున గుర్తు పడతారు. కాగా ఈ అమ్మడు తెలుగు నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఆహా కళ్యాణం అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి కెరియర్ ని స్టార్ట్ చేసింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోక పోవడంతో ఈ అమ్మడుకి పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో ఈ బ్యూటీ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. కానీ ఈ అమ్మడికి అక్కడ కూడా పెద్దగా సినిమా ఆఫర్లు వరించలేదు. దీంతో మళ్ళీ ఈ బ్యూటీ టా లీవుడ్ కి వచ్చేసింది.

ఈ క్రమంలో రాజుగాడు, మనసుకు నచ్చింది. తదితర చిత్రాల్లో నటించింది. కానీ ఈ చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. దీంతో ఈ బ్యూటీ సినీ కెరీర్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అయినప్పటికి అమైరా దస్తూర్ మాత్రం నిరాశ చెందకుండా సినిమా ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు పలు ఫోటో షూట్ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ బాగానే అలరిస్తోంది.

అయితే తాజాగా ఈ అమ్మడు సెలవులు గడిపేందుకు విహార యాత్రలకు వెళ్ళింది. ఈ క్రమంలో ఘాటుగా అందాలు ఆరబోస్తూ బికినీ దుస్తుల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది, దీంతో ఈ ఏమండీ అందాల ఆరబోతకు నెటిజన్లు ఒక్కసారిగా ఫిదా అయ్యారు. అలాగే అమైరా దస్తూర్ బికినీ లో మరింత హీట్ పెంచిందంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా 28 లక్షల మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు. దీన్ని బట్టి చూసుకోవచ్చు. ఈ బ్యూటీ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతుందో అని. అయితే ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీ కి సినిమా ఆఫర్లు పెద్దగా లేకపోవడంతో పలు వాణిజ్య సంస్థల ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది. కాగా ఆ మధ్య బ్యూటీ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసినందుకు ఈ బ్యూటీ ఏకంగా 10 లక్షల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు తమిళ్ లో భగీరా అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు చెన్నై పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రంలో హీరోగా ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ మరియు డైరెక్టర్ ప్రభుదేవా నటిస్తుండగా తమిళ ప్రముఖ దర్శకుడు ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నవంబర్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -