Actress Meena: తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల మీనా భర్త సాగర్ మరణించిన విషయం తెలిసిందే. భర్త మరణంతో ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్యాంతికి లోనయ్యింది మీనా. అయితే భర్త మరణం తర్వాత మీనా సోషల్ మీడియాలో మరింత ఎక్కువగా నిలుస్తోంది. భర్త మరణం తర్వాత ఆమె యాక్టివిటీస్ ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న నెటిజన్స్ హ్యాపీ బర్త్డే చనిపోయినందుకు బాధగా లేదంటూ రకరకాల కామెంట్స్ చేస్తూ ఆమెపై మండిపడుతున్నారు. కాగా మీనా భర్త సాగర్ చనిపోయినప్పుడు అతని మరణానికి కారణాలు ఇవే అంటూ సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ వినిపించిన సంగతి తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని చేసింది నటి మీనా. ఈ సందర్భంగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా రాసుకొచ్చింది. నేను ఈరోజు ఆర్గాన్ డొనేట్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నాను.. మీరు కూడా గొప్ప నిర్ణయాన్ని తీసుకోండి అని చెబుతూ మీనా ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఇక అందులో ఏముందంటే.. మనుషుల ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప పని, సహాయం మరొకటి ఉండదని..అలా ఒకరి ప్రాణాలను కాపాడటంలో ఈ ఆర్గాన్ డొనేషన్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుందని,అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఒకరికి అవయవాలు దానం చేయడం వల్ల వారి కుటుంబంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో నేను కళ్లారా చూశాను.
Actress Meena: అలాంటివారు ఉంటే నా భర్త బతికేవాడు..
నిజంగా అదొక వరం..నా భర్త సాగర్‌కు అలాంటి దాతలు దొరికి ఉంటే.. ఆయన ఇంకా బతికే వారు.. నా జీవితం ఇంకోలా ఉండేది.. ఒక దాత 8 మంది ప్రాణాలను కాపాడవచ్చు అని చెప్పుకొచ్చింది మీనా. అలాగే అవయవ దానం గొప్పదనం గురించి ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అవయవ దానం అనేది కేవలం డాక్టర్లు, పేషెంట్ల మధ్య సంబంధం కాదు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా అందరికీ సంబంధించింది.. నేను నా ఆర్గాన్స్‌ను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నాను. వాటిని అంతకంటే గొప్పగా ముందుకు తీసుకెళ్లే మార్గం మరొకటి లేదు అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది మీనా.