Samantha : టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ సమంత గురించి ఏ వార్త వచ్చినా కూడా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా తనకు సంబంధించిన ఒక వార్త రావటంతో ప్రస్తుతం ఆ వార్త సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. అదేంటంటే తన దగ్గర కూర్చోవాలంటే ఏకంగా 30 లక్షలు చెల్లించాలి అని వార్త రావటంతో ఆ వార్త విని జనాలు షాక్ అవుతున్నారు. ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రీసెంట్ గా సమంత తను బాధపడుతున్న మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి చికిత్స కోసం అమెరికాకు వెళ్ళగా ఇప్పటికే అక్కడికి సంబంధించిన కొన్ని ఫొటోస్ పంచుకుంది. కేవలం ట్రీట్మెంట్ ఒక్కటే కాకుండా అక్కడ కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించింది. అయితే ఈ నెల 20న అక్కడ ఇండియా డే ఫర్ అనే ఒక కార్యక్రమం జరుగగా సమంత అందులో పాల్గొన్న సంగతి తెలిసిందే.
అయితే అక్కడ జరిగిన ఈవెంట్లో సమంత పాల్గొన్నందుకు నిర్వాహకులు ఆమెకు రూ. 30 లక్షలు చెల్లించారని తెలిసింది. పైగా ఆ ఈవెంట్లో పాల్గొనే వారికి టికెట్టు ధర రూ.12 వేల నుంచి రెండు లక్షల వరకు నిర్ణయించారట నిర్వాహకులు. అయితే రెండు లక్షల రూపాయల టికెట్ తీసుకున్న వారికి సమంత దగ్గర కూర్చునే అవకాశం కూడా ఉంటుందని ఒక వార్త వైరల్ అయింది.
Samantha :
అయితే ఇందులో ఎంత నిజం ముందే తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త బాగా హల్చల్ చేస్తుంది. ఇక ఆ వ్యాధిని నయం చేసుకోవడానికి ఆమె మూడు నెలల పాటు అక్కడే ఉండనున్నట్లు తెలిసింది. ఇక విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఖుషి సినిమా షూటింగ్ కూడా పూర్తి కాగా త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో సమంత ఎటువంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.