Ananya Nagalla: ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతోమంది యువతీ యువకులు తమలోని టాలెంట్ ని నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యి సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా వచ్చిన గుర్తింపుతో సినిమా అవకాశాలు అందుకున్న వారిలో అనన్య నాగళ్ళ కూడా ఒకరు. మల్లేశం సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనన్య ఆ తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో కీలకపాత్రలో నటించి నటిగా మంచి గుర్తింపు పొందింది.
ఆ సినిమా ద్వారా గుర్తింపురావడంతో తర్వాత వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఇక ఇటీవల విడుదలైన శకుంతలం సినిమాలో కూడా కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. చిన్న పాత్ర,పెద్ద పాత్ర అని సంబంధం లేకుండా ఇలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ గట్టిగా తన టాలెంట్ నిరూపించుకుంటున్న అనన్య నాగళ్ళ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో అనన్య చేసే సందడి అంతా ఇంతా కాదు. తరచూ సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ తన అందంతో ఆకట్టుకుంటున్న ఈ అమ్మడు రోజురోజుకి ఫాలోయింగ్ పెంచుకుంటుంది.
Ananya Nagalla: ఎవరు ప్రపోజ్ చేయలేదు…
ఇలా ఫోటోలు షేర్ చేయడమే కాకుండా అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన అనన్యకి తన ప్రియుడి గురించి ప్రశ్న ఎదురవగా ఆసక్తికర సమధానం చెప్పింది. ఈ క్రమంలో ” నీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి..? అతని ఇన్ స్టా ఐడి చెప్పు” అని ఒక నెటిజన్ కోరగా.. అనన్య స్పందిస్తూ.. ‘ బాయ్ ఫ్రెండా.. అంత సీన్ లేదు బ్రదర్.. అందరూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అనుకుంటున్నారు అందుకే ఎవరు నాకు ప్రపోజ్ చేయడం లేదు” అంటూ సమధానం చెప్పింది.