Anasuya: బుల్లితెర గ్లామర్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా బుల్లితెర యాంకర్ గా రానిస్తున్న అనసూయ ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉంటూ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంది. ఇంతకాలం తన యాంకరింగ్ తో పాటు గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ ప్రస్తుతం తన వైవిద్యమైన నటనతో వెండితెర ప్రేక్షకులను అలరిస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తోంది.
అంతేకాకుండా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా పెళ్లిరోజు సందర్భంగా అనసూయ తన భర్తతో కలిసి సముద్ర తీరాన వెకేషన్ ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి మెరల్ గా మారాయి. అంతే కాకుండా భర్త గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఎమోషనల్ పోస్టు షేర్ చేసింది. సముద్రతీరాన భర్త తో కలిసి డిన్నర్ డేట్ ఎంజాయ్ చేస్తున్న వీడియోని షేర్ చేస్తూ.. ‘‘ నువ్వు నాకు రాసిన ఫస్ట్ లవ్ లెటర్ నాకు గుర్తుంది. 2001, జనవరి 23లో నువ్వు నాకు ఇచ్చిన మొదటి సమాధానం ఇవ్వలేదు.
Anasuya: నన్ను భరించినందుకు కృతజ్ఞతలు..
ఇన్నేళ్లుగా నాతో కలిసి ప్రయాణం చేసినందుకు కృతజ్ఞతలు. ఇన్నేళ్లు నువ్వు నన్ను చాలా భరించావు, నాకోసం ఎన్నో త్యాగాలు చేశావు. మన ప్రేమ మందిరానికి ఒక పిల్లర్ లాగా నిలబడ్డావు. నేను నా జీవితాంతం చికాకు పెట్టాలనుకునే ఏకైక వ్యక్తివి నువ్వే. నాకు తెలుసు మనిద్దరం పర్ఫెక్ట్ కపుల్ కాదని. కొన్ని సందర్భాలలో ఒకరి కోసం ఒకరు నిలబడలేకపోయాం. కొన్ని సందర్భాలలో మనం ఒకరితో ఒకరం చాలా దారుణంగా ఉంటాం. మన పెళ్లిని ఒక డేటింగ్ లాగా చేసిన నీకు కృతజ్ఞతలు. పెళ్లిరోజు శుభాకాంక్షలు” అంటూ పెళ్లి రోజు సందర్భంగా భర్తతో వైవాహిక జీవితం గురించి అనసూయ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. అనసూయ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.