Anasuya Bhardwaj అనసూయ ని అలా అన్న నెటిజన్… ఏకంగా దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిందిగా..!

Joythi R

Anasuya Bhardwaj ఒక పక్క సినిమాలలో మరో పక్క జబర్దస్త్ షోలో తన హాట్ హాట్ అందాలతో కుర్రకారు మతి పోగొడుతున్న టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ మరియు నటి అనసూయ భరద్వాజ్ గురించి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెలియనివారుండరు. అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు తను నటించినటువంటి చిత్రాలతో కంటే ఎక్కువగా తాను ధరించిన దుస్తుల విషయంలో వివాదాల్లో చిక్కుకుంటూ పాపులర్ అవుతోంది. ఐతే టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా మాధ్యమాలలో యాక్టివ్ గానే ఉంటున్న సంగతి అందరికి తెలిసిందే. దీంతో అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. దీంతో ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు తాను ధరించిన వస్త్రాల విషయంలో ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతుంది. దీంతో అనసూయ భరద్వాజ్ కూడా తనని ట్రోలింగ్ చేసిన వారిపై కూడా తనదైన శైలిలో రిప్లై ఇస్తూ ఘాటుగా వ్యాఖ్యలు చేస్తోంది.

అయితే తాజాగా ఓం నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ యాంకర్ అనసూయ భరద్వాజ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇందులో భాగంగా అనసూయగారు ఇద్దరు పిల్లల తల్లి అయినటువంటి మీరు ఇలా పొట్టి బట్టలు ధరించి ఆడవాళ్ళ పరువు తీస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో అనసూయ భరద్వాజ్ తనదైన శైలిలో స్పందిస్తూ ఆ నెటిజన్ చేసిన కామెంట్ ని స్క్రీన్ షాట్ తీసి తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది.. ఇందులో భాగంగా ఏకంగా మీ పని మీరు చేసుకోండి. అలాగే నా పని నేను చేసుకుంటాను దయచేసి ఇలా వంకరగా ఆలోచించి మీ మగవాళ్ళు పరువు కూడా తియ్యొద్దని ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఇంకేముంది తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నెటిజన్లు ఒక్కసారిగా యాంకర్ అనసూయ రిప్లై చూసి అవాక్కయ్యాడు. అయితే యాంకర్ అనసూయ చేసిన ఈ పనికి కొందరు నెటిజన్లు అభినందిస్తున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో కొందరు ఆకతాయిలు సినీ సెలబ్రిటీలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ పాపులర్ కావాలని చూస్తున్నారని అలాంటివారికి యాంకర్ అనసూయ సరిగ్గా బుద్ధి చెప్పింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నటి అనసూయ భరద్వాజ్ టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఖిలాడి చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య చిత్రంలో కూడా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి అయినట్లు సమాచారం. దీంతో తాజాగా ఈ హాట్ బ్యూటీ కి ఓ తెలుగు ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించే అవకాశం వరించినట్లు సమాచారం

- Advertisement -