Anasuya: అందాల నటి అనసూయ తాజాగా బేబీ సినిమా ట్రైలర్ పై స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ,వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ ‘బేబీ’ . జులై 14 వ తేదీ ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకి ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. ప్రమోషన్ పనులలో భాగంగా తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేశారు. బేబీ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ పై యాంకర్ అనసూయ కూడా స్పందిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
ఈ క్రమంలో అనసూయ స్పందిస్తూ..’ మీ సెలబ్రేషన్స్‌లో లేట్ గా జాయిన్ అయ్యాను. సాయిరాజేశ్‌ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది.తాజాగా విడుదలైన ట్రైలర్ నాకెంతో నచ్చేసింది. ఈ ట్రైలర్ లో ఒరిజినాలిటీ, హృదయాన్ని తాకేలా ఉన్న మాటలు చూస్తుంటే.. నాకు తెలిసిన వాళ్ల కథ లాగే అనిపిస్తుంది. ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా అంటూ తెలిపింది. అంతే కాకుండా ఆనంద్ చాలా ఇంటెన్స్‌గా నటించారు. ఎన్నో ఏళ్ల నుంచి శ్రమించి ఎస్‌కేఎన్ నిర్మాతగా ఈ స్థాయికి వచ్చారు. చిత్ర యూనిట్ కి నా అభినందనలు’’ అని రాసుకొచ్చింది. అనసూయ స్పందన పై ‘ బేబీ ‘ చిత్ర బృందం కూడా ఆనందం వ్యక్తం చేసింది.
Anasuya:తెలిసిన వాళ్ళ కథలా ఉంది..
ఇదిలా ఉండగా ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న నాలుగవ చిత్రం ఇది. మొదట దొరసాని సినిమా ద్వారా హీరోగా అడుగుపెట్టిన ఆనంద్ ఆ తర్వాత వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఆ సినిమా తర్వాత వచ్చిన పుష్పక విమానం సినిమా ఆనంద్ కి ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక ప్రస్తుతం సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందుతున్న బేబీ సినిమా ద్వారా ఆనంద్ దేవరకొండ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాతో ఆయన ఆనంద్ అకౌంట్లో మరొక హిట్ పడుతుందో లేదో చూడాలి మరి.