Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమా అవకాశాలతో బిజీగా మారడంతో బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో తరచూ తన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఈమె మేకప్ లేకుండా ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .అయితే ఈ ఫోటోని షేర్ చేసిన అనసూయ
రెండు నెలల ఆధ్యాత్మికపరమైన వర్కౌట్స్ తర్వాత తన కాన్ఫిడెన్స్ లెవల్ అంటూ క్లోజప్ షాట్ లో ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ నో ఫిల్టర్ అనే యాష్ ట్యాగ్‌ని కూడా షేర్ చేసింది. దీని కారణంగా తన కాన్ఫిడెన్స్ లెవల్ పెరిగినట్టు ఆమె పేర్కొంది.
ఇలా మేకప్ లేకుండా ఎలాంటి ఫిల్టర్ లేకుండా అనసూయ ఈ ఫోటోని షేర్ చేయడంతో తనకి కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెరిగాయని పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది ఫోటో అద్భుతంగా ఉందని నాచురల్ బ్యూటీ అంటూ పెద్ద ఎత్తున ఈ ఫోటోపై నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. అయితే కొందరు నెటిజెన్స్ ఈ ఫోటోపై యధావిధిగా తనని ట్రోల్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు నెటిజన్స్ ఈ ఫోటో పై స్పందిస్తూ మేకప్ లేకపోతే చర్మంపై ఉన్నటువంటి ముడతలని కనిపిస్తున్నాయని వయసు పెద్దదిగా కనపడుతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Anasuya: నాచురల్ బ్యూటీ…
ఇలా ఇక్కడి వరకు బానే ఉన్నా కొందరు నెటిజెన్స్ మాత్రం మేకప్ లేకపోతే ఏకంగా అమ్మమ్మ లాగా ఉన్నావు అంటూ కామెంట్ లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఈ ఫోటోలపై అనసూయ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇది మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. అయితే గత రెండు రోజుల క్రితం అనసూయ తను ట్రోల్లర్స్ గురించి పెద్దగా పట్టించుకోవడంలేదని తనకు వారిని సరిదిద్దడం కన్నా చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఇకపై తన గురించి వచ్చే కామెంట్లను లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.