Anasuya: అందాల యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర యాంకర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి గుర్తింపు సొంతం చేసుకున్నా అనసూయ ప్రస్తుతం యాంకరింగ్ కి దూరంగా ఉంటూ వరుస సినిమాలలో నటిస్తూ నటిగా బిజీగా మారిపోయింది. ప్రస్తుతం అనసూయ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో కొన్ని సందర్భాలలో అనసూయ షేర్ చేసే పోస్టులు వివాదాస్పదంగా మారుతూ ఉంటాయి.
సోషల్ మీడియాలో అనసూయని అభిమానించే వారి కంటే విమర్శించే వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె డ్రెస్సింగ్ గురించి కూడా తరచూ విమర్శలు వినిపిస్తూ ఉంటాయి. అయితే అనసూయ మాత్రం అలాంటి విమర్శలకు వెనుకడుగు వేయకుండా తనకి నచ్చినట్లు ఉంటానని విమర్శించే వారికి గట్టిగా సమాధానాలు చెబుతోంది. అలాగే అప్పుడప్పుడూ ఫెమినిస్ట్ కామెంట్స్ చేసి విమర్శలు పాలవుతోంది. ముఖ్యంగా విజయ్ దేవరకొండ అభిమానులకి అనసూయ కి మధ్య జరిగిన వివాదం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Anasuya: నా ప్రమేయం లేకున్నా పేరు వాడుతున్నారు…
ఇక తాజాగా సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసిన పోస్ట్ మరోసారి వైరల్ గా మారింది. తాజాగా తన హేటర్స్ మీద అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. ‘వావ్… నేను వాళ్లకు చాలా ముఖ్యం. నా ప్రమేయం ఉన్నా లేకున్నా, నాకు సంబంధం ఉన్నా లేకున్నా… నా పేరు ఎత్తకుండా ఒక్క డిస్కషన్ కూడా జరగదంతే… నాపై అంతా డిపెండ్ అయి ఉన్నారు. నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేకపోతున్నారు..’ అంటూ ఒక పోస్ట్ షేర్ చేసింది. అయితే అనసూయ అక్కడ ఎవరి పేరు ప్రస్తావించకపోవడంతో ఆమె ఎవరిని ఉద్దేశిస్తూ ఈ పోస్ట్ షేర్ చేసింది అని నెటిజన్లు ఆలోచనలో పడ్డారు. ఏది ఏమైనా అనసూయ షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.