Anasuya: న్యూస్ రీడర్ గా కెరియర్ మొదలుపెట్టిన అనసూయ జబర్దస్త్ లో యాంకర్ గా చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ షో ఆమెని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లి తిరుగులేని యాంకర్ ని చేసింది. ఈమె ప్రొఫెషనల్ గా ఎంత ట్రెండింగ్లో ఉంటుందో, పర్సనల్ గా కూడా అంతే ట్రోలింగ్ ని ఎదుర్కొంటూ ఉంటుంది.
తనకి వచ్చిన కామెంట్లకి రిప్లై ఇవ్వడంలో ఏ మాత్రం తగ్గదు ఈ స్టార్ యాంకర్. సినిమాలలో కూడా అవకాశాలని దక్కించుకుంటూ ప్రధాన పాత్రలు చేసే రేంజ్ కి ఎదిగింది అనసూయ. సోగ్గాడే చిన్నినాయన, క్షణం వంటి సినిమాల్లో నటించినప్పటికీ రంగస్థలం సినిమాలో ఆమె నటించిన రంగమ్మత్త పాత్ర ఆమెని ఓ రేంజ్ లో నిల్చోబెట్టింది.
యాంకరింగ్ చేయటానికి కూడా టైం లేనంతగా సినిమాలలో బిజీ అయిపోయింది అనసూయ. ఇప్పుడు ఆమె నటించిన రంగమార్తాండ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. రీసెంట్గా జరిగిన రంగమార్తాండ ప్రెస్ మీట్ లో స్టేజ్ మీదే కన్నీరు పెట్టుకుంది ఈ స్టార్ యాంకర్. దర్శకుడు కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన రంగమార్తాండ ఉగాది సందర్భంగా మార్చి 22న రిలీజ్ కాబోతోంది.
ఎందుకో ఈ సినిమాని అంతగా ప్రమోట్ చేయలేదు మేకర్స్. ఇండస్ట్రీ వాళ్లకి మాత్రమే స్పెషల్ ప్రీమియంస్ వేసి రివ్యూస్ ద్వారా ప్రమోట్ చేస్తూ వచ్చారు. రీసెంట్ గా రంగమార్తాండ ట్రైలర్ రిలీజ్ చేసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. అందులో భాగంగానే అనసూయ స్టేజ్ మీద మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుంది. మళ్లీ ఇలాంటి సినిమాలలో నటిస్తాను లేదో తెలియదు.
Anasuya:
నా జీవితానికి ఈ సినిమా చాలు అంటూ బాగా ఎమోషనల్ అయింది. నట సామ్రాట్ సినిమా చూసిన తరువాత కూడా ఈ సినిమాని చూసి ఎవరు ఏడుస్తారు అనుకున్నాను కానీ ఒక ఆడియన్ గా నేనే ఏడ్చేశాను. నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా ఇది. ఎప్పుడో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాను అందుకే ఈ సినిమాలో అవకాశం వచ్చింది అంటూ భావోద్వేగానికి గురైంది అనసూయ.