Anasuya: టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకర్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ తో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. అయితే కొన్ని సందర్భాలలో అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు , పోస్టుల వల్ల విమర్శలు ఎదుర్కుంటోంది. అయితే తనని ట్రోల్ చేసేవారీ మీద అనసూయ విరుచుకుపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆంటీ అంటూ ఆమెని ట్రోల్ చేయటంతో ఈ పదానికి వ్యతిరేకంగా అనసూయ పెద్ద యుద్ధమే చేసింది.
లైగర్ మూవీ ప్లాప్ అవటంతో అమ్మను తిట్టిన పాపం ఇలా వెంటాడింది అంటూ అనసూయ ట్వీట్ చేసింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెపై ట్రోలింగ్ చేస్తూ ఆంటీ అనే ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీంతో అనసూయ వారి మీద ఆగ్రహాం వ్యక్తం చేస్తూ పోలీస్ కంప్లైంట్ ఇస్తానని హెచ్చరించి వారి మీద సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఇలా కొంతకాలం సోషల్ మీడియాలో ఆంటీ అనే పదం ట్రెండ్ అయ్యింది. అయితే తాజాగా నెటిజన్ ” ఆంటీ అంటే మీకు ఎందుకంత కోపం అక్క “అంటూ ప్రశ్నించాడు.
Anasuya: వేరే అర్థం ఉంటుంది…
దీనికి అనసూయ స్పందిస్తూ..” అవును అలా పిలిస్తే నాకు కోపం . ఎందుకంటే ఆ పిలుపు వెనుక వేరే అర్థం ఉంటుంది. అయితే ఈ మధ్య నాకు కోపం రావడం లేదు. ఈ ట్రోలర్స్ ని చక్కదిద్దడం కంటే ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయి’ అంటూ సమాధానం చెప్పింది. ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.బుల్లితెరకు దూరమైనటువంటి అనసూయ ప్రస్తుతం వెండితెర సినిమా అవకాశాలు అందుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు తాజాగా ఈమె రంగమార్తాండ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకుంది.