Anchor Anasuya: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ గా, వెండితెరపై నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఇక తన అందాలతో మాత్రం ఓ రేంజ్ లో పిచ్చెక్కిస్తుంది. ఈ వయసులో కూడా అనసూయ ఇంత గ్లామర్ షో చేస్తుంది అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. జబర్దస్త్ లో యాంకర్ గా అడుగుపెట్టిన ఈమెకు బాగా కలిసి వచ్చింది. అక్కడి నుంచి వెండితెరపై మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.
ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్గా ఉంటూ తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది. అంతేకాకుండా ఏదైనా నెగటివ్ కామెంట్ లు వస్తే చాలు వెంటనే రియాక్ట్ అవుతూ ఉంటుంది. అయితే తాజాగా షారుక్ మాటలకు కూడా స్పందించింది అనసూయ. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సక్సెస్ మీడియాలో కొన్ని ఇంట్రెస్టింగ్ గా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. తమ అందరి ఉద్దేశం ఒకటే అని అందరం ఆనందాన్ని పంచాలని అనుకుంటూ ఉంటాం.. నేను కూడా కొన్ని సినిమాలలో నెగటివ్ రోల్స్ చేశాను. పఠాన్ సినిమాలో కూడా జాన్ అబ్రహం నెగటివ్ రోల్ లో నటించాడు.
Anchor Anasuya:
అంత మాత్రాన మేం చెడ్డవాళ్ళం కాదు అంటూ.. మీరు సంతోషంగా ఫీల్ అవ్వటానికే ఆ పాత్రలలో నటిస్తున్నాం.. అంతేకానీ ఎవరి సెంటిమెంట్స్ ని దెబ్బతీసే ఉద్దేశం లేదు అని అనటంతో వెంటనే ఆ మాటలకు అనసూయ తన ఇంస్టాగ్రామ్ వేదికగా స్పందించింది. షారుఖ్ చెప్పిన మాటలను స్టోరీ రూపంలో పంచుకొని.. ఏ మాటలు నేను ఎప్పటినుంచో చెబుతున్నాను అంటూ.. మేము పాత్రలు మాత్రమే పోషిస్తున్నాం.. మేం నిజంగా చెడ్డవాళ్ళం కాదు అని తెలిపింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్లు బాగా వైరల్ అవుతున్నాయి.