Anchor Anasuya: జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ అనసూయ ప్రస్తుతం వెండితెర నటిగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె ప్రస్తుతం వెండితెరపై ఆరేడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అదే విధంగా బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమంతో పాటు మరో రెండు కొత్త షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇలా కెరీర్ పరంగా అనసూయ ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు కెరీర్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన విలువైన సమయాన్ని కుటుంబంతో గడుపుతూ కుటుంబ బాధ్యతలను కూడా నెరవేరుస్తున్నారు.
ఇలా నటిగా, యాంకర్ గా, ఒక గృహిణిగా అనసూయ తన జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ జీవితంలో ముందుకు సాగుతున్నారు.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునే అనసూయ తాజాగా తన ఫ్యామిలీతో కలిసి హాలిడే వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈమె తన భర్త పిల్లలతో కలిసి సముద్రతీరాన సముద్ర అందాలని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేశారు.ఇకపోతే అనసూయ పడుచు పిల్లలా మారి తన భర్తతో సముద్రతీరాన రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోయారు.

Anchor Anasuya: పెళ్లిరోజు సందర్భంగా..
ఈ క్రమంలోనే పొట్టి దుస్తులు ధరించి తన అందాలను ఆరబోస్తూ భర్త కౌగిలిలో ఒదిగిపోవడమే కాకుండా తన భర్తకు లిప్ లాక్ ఇస్తూ ఎంతో సరదాగా గడిపారు. అయితే అనసూయ ఇలా తన భర్తతో సంతోషంగా గడపడానికి కూడా ఓ కారణం ఉంది. అనసూయ తన 12వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ తన భర్తతో కలిసి ఎంతో సరదాగా ఎంజాయ్ చేశారు. ఈ సందర్భంగా ఈమె ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన పెళ్లి రోజు గురించి ఒక నోట్ రాసుకొచ్చారు. 21 సంవత్సరాల పాటు కలిసి ఉన్నా 12 ఏళ్ళ వైవాహిక జీవితంలో నీలో ఎన్నో కోణాలను చూశాను. నిత్యం నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ రాసుకొచ్చారు. ఇలా అనసూయ చేసిన ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ గా మారింది.