Anchor Anasuya: సాధారణంగా ఏదైనా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేయాలంటే స్టార్ హోదా ఉన్నటువంటి సెలబ్రిటీలను ఆహ్వానించడం సర్వసాధారణం. ఈ క్రమంలోనే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోని హీరోయిన్లతో సమానంగా బుల్లితెర నటిమనులు యాంకర్లు కూడా షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.ఎంతో మంచి పేరు సంపాదించుకున్న యాంకర్ అనసూయకు హీరోయిన్ రేంజ్ పాపులారిటీ ఉందని చెప్పాలి.
ఇలా ఎంతో పాపులారిటీ ఉన్నటువంటి ఈమె తాజాగా శ్రీకాళహస్తిలో సందడి చేశారు.శ్రీకాళహస్తిలో బాలాజీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈమెను ఆహ్వానించడంతో అనసూయ శ్రీ కాళహస్తిలో సందడి చేసి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేశారు.ఇక ఒక ప్రాంతంలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సెలబ్రిటీలు రాబోతున్నారని వార్త తెలియగానే పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకొని చేసే హంగామా ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. కొన్నిసార్లు వారి అభిమానంతో సెలబ్రిటీలకు ఊపిరాడనివ్వకుండా చేస్తుంటారు.
Anchor Anasuya సెల్ఫీల కోసం అనసూయని చుట్టుముట్టిన అభిమానులు…
ఇక అనసూయ విషయంలో కూడా అదే చోటు చేసుకుందని చెప్పాలి అనసూయ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఇక అనసూయ అక్కడికి రావడంతో అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడటంతో అనసూయ కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఇక అనసూయ ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అనంతరం వేదికపై డాన్స్ చేస్తూ చిందులు వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.