Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా, వెండితెర రంగమ్మత్తగా ఇటు బుల్లితెరపై, అటు వెండి తెరపై నటిస్తూ బిజీగా ఉన్నటువంటి యాంకర్ అనసూయ గురించి అందరికీ సుపరిచితమే.కెరియర్ మొదట్లో న్యూస్ ఛానల్ లో పనిచేసిన అనసూయ అనంతరం పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే తనకు జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు వచ్చింది.ఇలా యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ రాని గుర్తింపు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా ద్వారా రంగమ్మత్త పాత్రలో నటించారు.
ఈ విధంగా రంగమ్మత్త పాత్రలో అనసూయ నటన ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే ఈమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి.ప్రస్తుతం సినిమా అవకాశాలతో వెండితెరపై ఎంతో బిజీగా ఉన్నా అనసూయ బుల్లితెరపై కూడా జబర్దస్త్ కార్యక్రమంతో పాటు సరికొత్త కార్యక్రమాలకు యాంకర్ గా అవకాశాలను అందుకొని ఎంతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ మాలో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ జూనియర్ అనే కార్యక్రమానికి అనసూయ సుడిగాలి సుధీర్ తో కలిసి యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఇక ఈ కార్యక్రమం ద్వారా అనసూయ చేసే సందడి మామూలుగా లేదని చెప్పాలి.

Anchor Anasuya: బుల్లెట్ పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసిన అనసూయ…
ఈ క్రమంలోనే గతవారం ప్రసారమైన ఈ కార్యక్రమంలో అనసూయ ఎంతో క్యూట్ లుక్ లో కనిపించారు. అద్భుతమైన అవుట్ ఫిట్ తో అనసూయ వయసులో కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని చెప్పాలి. ఈ అవుట్ ఫిట్ లో ఎంతో అందంగా ఉన్నటువంటి అనసూయ చిన్నారులతో కలిసి కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్టు అనే పాటకు అద్భుతమైన స్టెప్పులు వేశారు.ఈ క్రమంలోనే అనసూయ డాన్స్ పై పలువురు నెటిజన్లు యధావిధిగా తనపై కామెంట్లు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఈ డాన్స్ వీడియో కొందరు నెటిజన్లు స్పందిస్తూ..ఏంటండీ మీరు మరి ఇలా చిన్న పిల్లలతో కలిసి డాన్స్ చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి అనసూయ ఏం చేసినా కూడా సెన్సేషనల్ అవుతుంది.