Anchor Anasuya: యాంకర్ అనసూయ పరిచయం అవసరం లేదు ఈమె బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఈమె సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉండటం వల్ల బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు. ఇదిలా ఉండగా అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు. అయితే కొన్నిసార్లు ఈమె చేసే ట్వీట్ కారణంగా బారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే గతంలో విజయ్ దేవరకొండ సినిమా లైగర్ విడుదలైన సమయంలో ఈమె సినిమా గురించి అలాగే విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేసినటువంటి పోస్ట్ వైరల్ అయింది.
ఇలా విజయ్ దేవరకొండను అనసూయ టార్గెట్ చేస్తూ పోస్ట్ చేయడంతో విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయను భారీగా ట్రోల్ చేశారు.అయితే ఈ ట్రోల్స్ పై అనసూయ కూడా గట్టిగానే స్పందించారు. అయినప్పటికీ విజయ్ ఫాన్స్ భారీగా ట్రోల్ చేయడంతో ఏకంగా ఈమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ విషయం చాలా వివాదంగా మారింది. అయితే తాజాగా మరోసారి విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే మరోసారి విజయ్ ఫ్యాన్స్ తనని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
Anchor Anasuya పైత్యం అంటూ పోస్ట్ చేసిన అనసూయ…
అనసూయ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ …ఇప్పుడే ఒకటి చూశాను. ‘The’ naa?? బాబోయ్!!! పైత్యం.. ఏంచేస్తాం. అంటకుండ చూసుకుందాం.’ అంటూ ట్వీట్ చేసింది. అయితే ఈమె విజయ్ దేవరకొండని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారని అర్థమవుతుంది. తాజాగా ఖుషి సినిమా నుంచి విజయ్ దేవరకొండకు సంబంధించిన ఒక పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్లు The Vijadevarakonda పని ఉండడంతో ఈమె పరోక్షంగా విజయ్ ను ఉద్దేశిస్తూ ఇలాంటి పోస్ట్ చేశారని అర్థమవుతుంది. అయితే దీనిపై విజయ్ దేవరకొండ అభిమానులు స్పందిస్తూ అనసూయని యధావిధిగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ పోస్ట్ కారణంగా విజయ్ దేవరకొండ అభిమానులు అనసూయ మధ్య మరోసారి వివాదం చెలరేగుతుంది.