Anchor Anasuya: అనసూయ అంటే ఎందుకో అంత ప్రేమ.. మల్లెమల కూడా చెయ్యనది జీ5 చేస్తుందిగా!

Akashavani

Anchor Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా యాంకర్ గా గుర్తింపు పొందిన ఈమె అనంతరం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారు.ఈ విధంగా అనసూయ ఎన్నో సినిమాలలో నటిస్తూ ప్రస్తుతం ఎంతో బిజీబిజీగా గడుపుతున్నారు.ఇకపోతే అనసూయ కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా పలు కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు.

కేవలం జబర్దస్త్ యాంకర్ గా మాత్రమే కాకుండా ఏదైనా స్పెషల్ ఈవెంట్స్ ఉంటే తప్పనిసరిగా ఆ కార్యక్రమంలో అనసూయ సందడి ఉండాల్సిందే. ఇలా సోషల్ మీడియాలోనూ బిజీగా ఉండే అనసూయ నేడు పుట్టిన రోజున జరుపుకుంటుంది.ఈ క్రమంలోనే పెద్దఎత్తున నెటిజన్లు ఈమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనసూయ పుట్టినరోజు సందర్భంగా జీతెలుగు ఈమెకు ఊహించని విధంగా పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేసినట్లు తెలుస్తోంది.

Anchor Anasuya: అనసూయ అంటే ఎందుకో అంత ప్రేమ.. మల్లెమల కూడా చెయ్యనది జీ5 చేస్తుందిగా!
Anchor Anasuya: అనసూయ అంటే ఎందుకో అంత ప్రేమ.. మల్లెమల కూడా చెయ్యనది జీ5 చేస్తుందిగా!

Anchor Anasuya: అధరహో అనసూయ….

అనసూయ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఈటీవీలో ఎంతో గుర్తింపు పొందారు. అయితే మల్లెమాల వారు కూడా ఈమె పుట్టినరోజు కోసం ఇలా చేయలేదు కానీ జీ తెలుగు వాళ్ళు మాత్రం అనసూయపై ప్రేమతో ఏకంగా ఆమెకు పుట్టిన రోజు వేడుకలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.అదరహో అనసూయ అనేలా ఈమె పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే ఈ పుట్టిన రోజు వేడుకలకు సంబంధించిన ప్రోమో జీతెలుగు విడుదల చేసింది. ఇక నేడు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఎపిసోడ్ ప్రసారం కానుంది. అనసూయ యాంకర్ గా మల్లెమాల వారు నిర్వహిస్తున్న జబర్దస్త్ కార్యక్రమంతో గుర్తింపు పొందారు. కానీ మల్లెమాల వారు మాత్రం అనసూయకు ఇలా వేడుక చేయకపోవడంతో ఈ విషయం గురించి నెటిజన్లు పెద్ద ఎత్తున మల్లెమాల పై విమర్శలు చేస్తున్నారు.

- Advertisement -