Anchor Deepthi: ప్రముఖ న్యూస్ ఛానల్ లో యాంకర్ గా ,న్యూస్ రీడర్ గా పని చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న దీప్తి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రముఖ న్యూస్ ఛానల్ ద్వారా యాంకర్ గా పరిచయమైన ఈమె బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమానికి కంటెస్టెంట్ గా వెళ్లారు. ఈ విధంగా బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ గా వెళ్లిన ఈమె ఈ కార్యక్రమంతో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన పాపులారిటీతో దీప్తి కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాన్ని అభిమానులతో పంచుకుంటారు. అదేవిధంగా సొంతంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్క వీడియోని అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ వీడియోలు, ఇంస్టాగ్రామ్ రీల్స్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు.ఈ విధంగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేస్తూ అందరినీ షాక్ కి గురి చేశారు.

Anchor Deepthi: చెయ్యి విరిగేలా ఏం చేసావక్కా…
దీప్తి ప్రమాదవశాత్తు ఎడమచేతికి బాగా దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది.ఈక్రమంలోనే ఎడమ చేతికి బ్యాండేజి ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హ్యాండ్ ఇంజురీ అంటూ ప్రమాదం జరిగిన విషయాన్ని తెలియజేశారు.ఇలా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది నెటిజన్లు ఏం జరిగింది అక్క అంటూ కామెంట్లు చేయడమే కాకుండా ఇంతలా చేయి విరిగేలా ఏం చేసావమ్మా అంటూ కామెంట్లు పెడుతున్నారు.మొత్తానికి ఎప్పుడూ ఎంతో దూకుడుగా చలాకీగా ఉండే దీప్తి ఇలా చేయి విరగొట్టుకోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున కామెంట్ చేస్తూ తన యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు.