Anchor Lasya: టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన వారిలో లాస్య కూడా ఒకరు. మొదట మ్యూజిక్ ఛానల్ లో యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన లాస్య ఆ తర్వాత బుల్లితెర మీద ప్రసారమైన అనేక టీవీ షోలో యాంకర్ రవితో కలిసి సందడి చేసింది. ఇలా వీరిద్దరూ ఏ షో చేసినా కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునేవి. యాంకర్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందిన లాస్య మంజునాథ్ ని వివాహం చేసుకున్న తర్వాత యాంకరింగ్ కి దూరం అయింది. ఆ తర్వాత బాబు పుట్టడంతో పూర్తిగా ఇంటికే పరిమితం అయింది. అయితే లాస్య యాంకరింగ్ కి దూరంగా ఉన్నప్పటికీ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికీ ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది.
ఇటీవల లాస్య రెండవసారి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లాస్య ఎప్పటికప్పుడు తనకు, తన కుటుంబానికి సంబంధించిన విషయాల గురించి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా తన భర్త మంజునాథ్ పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Anchor Lasya: నా కన్నీళ్లు తుడిచావు…
.
భర్త పుట్టినరోజు సందర్భంగా లాస్య సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తూ… ” హ్యాపీ బర్త్ డే మంజునాథ్.. ఎలాంటి సమయంలో అయిన నా పక్కన అండగా నిలబడ్డావు. నా కన్నీళ్లు తుడిచావు. నన్ను నవ్వించవు, నా జయాపజయాలను చూసావు. లవ్ యు . అంతే కాదు ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ కి భార్యగా గర్వపడుతున్నాను” లాస్య తన భర్త గురించి చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం లాస్య షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో లాస్య అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా మంజునాథ్ కి పుట్టిన రోజు శుభకాంక్షలు తెలియచేస్తున్నారు.