Anchor Pradeep: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మేల్ యాంకర్లలో ప్రదీప్ మాచిరాజు ఒకరు.ఈయన బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రతి ఒక్క ఛానల్లోనూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రదీప్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.ఇలా యాంకర్ గా ఈయన ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా ఇదివరకు పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి సందడి చేశారు.
ఇలా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ప్రదీప్ అనంతరం 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరవాలేదనిపించింది. ఇక ఈ సినిమాలో నీలి నీలి ఆకాశం అనే పాట విపరీతంగా ప్రేక్షకులను సందడి చేసిందని చెప్పాలి. ఈ సినిమా అనంతరం ప్రదీప్ తన తదుపరి సినిమాలను ప్రకటించలేదు. అయితే తనకు మంచి కథ దొరికితే తప్పకుండా హీరోగా చేస్తానని ఈయన వెల్లడించారు.
Anchor Pradeep :భారీగా డిమాండ్ చేస్తున్న ప్రదీప్…
ఈ విధంగా ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు మాత్రమే పరిమితమైన ప్రదీప్ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న ప్రదీప్ ఒక్కో ఎపిసోడ్ కు భారీ మొత్తంలోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఈయన ఒక రోజు కాల్ షీట్ ఇస్తే తప్పకుండా 5 లక్షల రూపాయల వరకు చార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా ఒక్క ఎపిసోడ్ కు 5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఈ విధంగా ఈయన అడిగిన రెమ్యూనరేషన్ ఇస్తూ నిర్మాతలు తనతో కార్యక్రమాన్ని చేస్తున్నారు అంటే ప్రదీప్ కిఏ స్థాయిలో క్రేజ్ ఉందో అర్థమవుతుంది అలాగే ఈయన యాంకర్ గా వ్యవహరించే కార్యక్రమాలు ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేస్తాయో తెలుస్తుంది. ఏది ఏమైనా ప్రదీప్ యాంకర్ గా భారీగానే సంపాదిస్తున్నారని చెప్పాలి.