Anchor Pradeep: బుల్లితెరపై టాప్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న ప్రదీప్ మాచిరాజు గురించి అందరికీ తెలిసిందే. రేడియో జాకీ ద్వారా మంచి గుర్తింపు అందుకున్న ప్రదీప్ ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా పరిచయమయ్యాడు. తన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు ఎన్నో షోలలో యాంకరింగ్ చేస్తూ బాగా సందడి చేశాడు.
అంతేకాకుండా వెండితెరపై 100% లవ్, జులాయి, అత్తారింటికి దారేది వంటి పలు సినిమాలలో నటించగా ఆ మధ్య 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాతో హీరోగా కూడా పరిచయం అయ్యాడు. ఇక ప్రస్తుతం బుల్లితెరలో వరుస షో లలో బాగా బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ప్రదీప్ కు అమ్మాయిల ఫాలోయింగ్ విపరీతంగా ఉందని చెప్పాలి.
ఇదంతా పక్కన పెడితే ఈయనపై క్రష్ ఉందంటూ ఒక హీరోయిన్ కూడా పెద్ద షాక్ ఇచ్చింది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రద్ధాదాస్. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా ఢీ 15 కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఇక ఈ డాన్స్ షోలో శ్రద్ధాదాస్ జడ్జిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ కూడా జడ్జిలుగా చేస్తున్నారు.
ఇక ప్రదీప్ యాంకర్ గా చేయగా.. హైపర్ ఆది, బిగ్బాస్ జెస్సి టీం లీడర్స్ గా చేస్తున్నారు. అయితే హైపర్ ఆది కి అమ్మాయిల పిచ్చి అంటే ఎక్కువ. దీంతో శ్రద్ధాదాస్ ను ప్రతిసారి ఏదో ఒక విధంగా ఇంప్రెస్స్ చేయాలని అనుకుంటాడు. అయితే తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో శ్రద్ధ.. తనకు ప్రదీప్ పై చిన్న క్రష్ ఉంది అంటూ పెద్ద షాక్ ఇచ్చింది.
Anchor Pradeep:
అంతేకాకుండా అతనితో ఒక రొమాంటిక్ డాన్స్ కూడా చేసింది. మధ్యలో శేఖర్ మాస్టర్.. ఆ చిన్న క్రష్ పెద్ద క్రష్ ఎప్పుడు అవుతుంది అని అడగటంతో.. తెలియదు కానీ చూడాలి అంటూ శ్రద్ధా సరదాగా సమాధానం ఇచ్చింది. దీంతో హైపర్ ఆది వెంటనే శేఖర్ మాస్టర్ ని మీకు ఆరోగ్యం బాలేదా అంటూ అలా మాట్లాడుతున్నారు ఏంటి అంటూ ప్రశ్నించాడు. ప్రస్తుతం ఆ ప్రోమో బాగా వైరల్ అవుతుంది.