Anchor Prashanthi: ప్రేక్షకులను అలరించడానికి బుల్లితెర మీద ఎన్నో టీవీ షోలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. తాజాగా జీ తెలుగులో సరికొత్త షో ప్రారంభం అయింది. సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ షోలు, సినిమాలు, సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన స్టార్స్ ను తీసుకువచ్చి సూపర్ క్వీన్ సెకండ్ సీజన్ ప్రారంభించారు. ఇందులో కండక్టర్ ఝాన్సీ, జబర్థస్త్ పవిత్ర, సామీ సామీ అంటూ పాట పాడి ఫేమస్ అయిన మౌనిక యాదవ్,లేడీ కమెడియన్ విద్యుల్లేఖ రామన్, సుహాసిని, ప్రశాంతి వంటి కొంతమంది సీరియల్ నటీమణులు ఈ షో లో సందడి చేయటానికి సిద్ధమయ్యారు. తాజాగా ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఈ ప్రోమోలో సూపర్ క్వీన్స్ అందరూ తమ జీవితాల్లో జరిగిన కష్టాలు, నష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక ఈ షో లో ఫోక్ సింగర్ కనకవ్వ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. పల్లెటూరిలో మట్టి తీసుకుంటూ బ్రతికే తనకు 60 ఏళ్ల తర్వాత ఏళ్ల తరువాత తన కెరీర్ ప్రారంభమైందని, అసలు ఈ స్థాయిలో తనకు ఆదరణ లభిస్తుందని తాను ఊహించలేదని కనకవ్వ చెప్పుకొచ్చింది. అలాగే అభిషేకం, ఇంటికి దీపం ఇల్లాలు వంటి ఎన్నో సీరియల్స్ లో లేడీ విలన్ గా నటించిన ప్రియాంక కూడా ఎమోషనల్ అయ్యింది.
Anchor Prashanthi: నాకోసం ఎంతో కష్టపడింది..
ఈరోజు నటిగా తాను ఈ స్థానంలో ఉండటానికి తన తల్లి కారణమని తెలిపింది. “సాధారణంగా నటీనటులు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చామని చెబుతారు. కానీ మా అమ్మ కష్టపడితే నేను ఈ స్థాయికి వచ్చాను అంటూ ప్రియాంక తల్లి గొప్పతనాన్ని చెబుతూ ఎమోషనల్ అయింది. ఆ తర్వాత గృహలక్ష్మీ సీరియల్‌లో లాస్య పాత్రలో నటించి లేడీ విలన్స్‌లో గ్లామరస్ బ్యూటీగా ప్రశాంతి పేరు సంపాదించుకుంది. సూపర్ క్వీన్ షోలో ప్రశాంతి కూడా” తన అమ్మ తన కోసం ఎంతో కష్టపడిందని, కానీ ఒకరోజు లివర్ క్యాన్సర్ వల్ల అమ్మ చనిపోయిందని చెబుతూ స్టేజ్ మీదే కంటతడి పెట్టేసింది. దీంతో ఆమె బాధ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం సూపర్ క్వీన్ సెకండ్ సీజన్ కి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.