Anchor Rashmi: న్యూ ఇయర్ వస్తుందంటూ.. అందరూ పార్టీలకు రెడీ అయిపోతారు. ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక సెలబ్రెటీలకు కూడా ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా హాట్ యాంకర్ రష్మీ ముందుగానే న్యూ ఇయర్ పార్టీని చేసుకుంది. తన ఫ్రెండ్స్ దీపికా పిల్లి, మరొకరితో కలిసి పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో ఫుల్ ఎంజాయ్ చేసింది.
ఫ్రెండ్స్ తో కలిసి వైన్ తాగుతూ ఫుల్ చిల్ అయింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్న రష్మీ.. లాస్ట్ నైట్ అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. న్యూ ఇయర్ మూడ్‌లోకి రష్మీ ముందుగా వెళ్లిపోయిందని, ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తోన్నారు. న్యూ ఇయర్ రాకముందే రష్మీ ఫుల్ చిల్ అవుతుందంటే.. న్యూ ఇయర్ రోజు ఇక రచ్చ రచ్చ చేస్తుందంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్ చేస్తోన్నారు.
రష్మీ పార్టీలు చేసుకోవడం ఇది తొలిసారి. రష్మీ తన ఫ్రెండ్స్ తో మందు కొడుతూ తీసిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో గతంలో పలుమార్లు పంచుకుంది. అమ్మాయిలు మందు దాగితే తప్పా అంటూ ఆమె ప్రశ్నలు కురిపించింది. తాను వైన్ తాగుతానని, అందులో తప్పేముందంటూ చెబుతోంది. గతంలో ఫుల్ గా మందు తాగి చిల్ అవుతున్న ఫొటోలు రష్మీ సోషల్ మీడియాలో పంచుకోవడంతో.. పలువురు నెటిజన్లు ఆమెపై విమర్శలు కురిపించారు.
Anchor Rashmi:
రష్మీ ప్రస్తుతం యాంకర్ గా పనిచేస్తూనే.. పలు సినిమాల్లో కూడా నటిస్తోంది. ఇటీవల బొమ్మ బ్లాక బస్టర్ సినిమాలో రష్మీ నటించింది. ప్రస్తుతం మంచి కథల కోసం రష్మీ వేచి చూస్తోంది. అయితే ఇటీవల జబర్దస్త్ షోకు రష్మీ దూరమైంది. ఆమె స్థానంలో మరోకరు హీరోయిన్ గా వచ్చారు. దీంతో సినిమాల్లో బిజీగా ఉండటం వల్లనే రష్మీ జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిందనే ప్రచారం జరుగుతోంది.