Anchor Rashmi: బుల్లితెర గ్లామరస్ యాంకర్ రష్మీ ప్రస్తుతం విదేశాలలో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. టివి షో లు, సినిమాలతో బిజీగా ఉండే రష్మి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి విదేశాలలో సముద్ర తీరాన సేద తీరుతుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేష్మి తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. విదేశీ రోడ్లమీద రష్మీ, నిక్కర్ తో చెక్కర్లు కొడుతోంది. అంతే కాకుండా సముద్ర తీరాన సేదతీరుతున్న రష్మి ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో రష్మి థైస్ అందాలు అకుట్టుకుంటున్నాయి.
ప్రస్తుతం రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తుంది. అంతేకాకుండా అప్పుడప్పుడు జబర్దస్త్ లో కూడా యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక మరొకవైపు హీరోయిన్ గా కూడా నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల రష్మి,నందు జంటగా నటించిన సినిమా హిట్ అవటంతో హీరోయిన్ గా రష్మికి అవకాశాలు వరుస కడుతున్నాయి. అయితే హీరోయిన్ గా అవకాశాలు వచ్చినప్పటికీ ఈ అమ్మడు మాత్రం జబర్థస్త్ షో కి మాత్రం దూరం కానంటోంది.
Anchor Rashmi: హాలిడే వెకేషన్ లో చిల్ అవుతున్న రష్మీ…
ఇక రష్మికి సమాజ సేవ కూడా ఎక్కువ . ముఖ్యంగా మూగ జీవాల పట్ల రష్మి తన మంచి మనసు చాటుకుంటూ ఉంటుంది. రోడ్ల మీద కనిపించే మూగ జీవాలకు ఆహారం అందించటమే కాకుండా ఆపదలో ఉన్న వాటిని చేరదీసి వాటిని పెంచి పోషిస్తోంది. అంతే కాకుండా ఎవరైనా మూగ జీవాల పట్ల కటినంగా ప్రవర్తిస్తే రష్మి వారి పై విరుచుకుపడుతుంది. ఇటీవల హైదరాబాద్లో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనలో కూడా రష్మీ పిల్లాడి తల్లిదండ్రులను తప్పు పట్టింది.