Anchor Rashmi: టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన వారిలో రష్మి గౌతమ్ కూడా ఒకరు. మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ జీవితం ప్రారంభించిన రష్మీ ప్రస్తుతం బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా మంచి గుర్తింపు పొందింది. ఇదిలా ఉండగా రష్మీ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. తాజాగా శుక్రవారం రోజున రష్మీ ఇంట్లో విషాదం చోటు చేసుకున్న సంగతి ఇంస్టాగ్రామ్ వేదికగా తన అభిమానులతో పంచుకుంది. ఈ శుక్రవారం రష్మీ గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా మరణించిన సంగతి తెలియజేస్తూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఎమోషనల్ నోట్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంస్టాగ్రామ్ వేదికగా తన గ్రాండ్ మదర్ మరణించిన విషయాన్ని తెలియజేస్తూ తన గ్రాండ్ మదర్ తో తనకి ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యింది. ఈ క్రమంలో ” ఈ రోజు మా గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులందరూ బరువెక్కిన గుండెతో ఆమెకి వీడ్కోలు పలికారు. ఆమె చాలా గొప్ప వ్యక్తి. ఆమె ప్రభావం మాపై చాలా ఉంది. ప్రస్తుతం ఆమె లేకపోయినా కూడా ఆమె జ్ఞాపకాలు చిరకాలం మాతోనే ఉంటాయి. ఓం శాంతి ” అంటూ ఇన్స్టాలో నోట్ పోస్ట్ చేసింది. దీంతో పలువురు సెలబ్రిటీలు, జబర్థస్త్ కామెడీయన్స్ తో ఆమె అభిమానులు కూడా సంతాపం తెలిపారు.
Anchor Rashmi:రష్మీ ఇంట్లో విషాదం..
ఇదిలా ఉండగా రష్మి కెరీర్ విషయానికి వస్తే… బుల్లితెర మీద సక్సెస్ఫుల్ యాంకర్ గా గుర్తింపు పొందిన రష్మి అనేక టీవీ షోలో యాంకర్ గా వ్యవహరించటమే కాకుండా సినిమాలలో హీరోయిన్గా కూడా నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఇటీవల రష్మీ హీరోయిన్ గా నటించిన సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమా తర్వాత రష్మీకి హీరోయిన్ అవకాశాలు వస్తున్నాయి. ఇలా యాంకర్ గా హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందిన రష్మి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. ఇక మూగజీవాలు అంటే రష్మి కి ఎంతో ప్రేమ. రోడ్డు మీద కనిపించే మూగ జీవాలను చేరదీసి వాటికి ఆహారం అందించటమే కాకుండా మూగజీవాల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్న వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటుంది.