Anchor Rashmi: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీ ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాలలో భాగంగా ఈమె గతంలో సుడిగాలి సుదీర్ తో కలిసి చేసే రచ్చ మాములుగా ఉండేది కాదు దీంతో వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా అనే సందేహాలు కూడా వ్యక్తం అయ్యేవి. ఇలా సుడిగాలి సుదీర్ రష్మీ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో నిజజీవితంలో కూడా వీరిద్దరూ ఒక్కటైతే బాగుంటుందని చాలామంది అనుకున్నారు.
ఇక ఇదే విషయాన్ని నేరుగా రష్మీ సుధీర్ కి చెప్పడంతో తమ మధ్య అలాంటి రిలేషన్ ఏమీ లేదని ఇద్దరం మంచి స్నేహితులు అంటూ చెప్పుకొచ్చారు. అయితే సుధీర్ ప్రస్తుతం ఈటీవీ కార్యక్రమాలకు దూరమైనప్పటికీ రష్మీ మాత్రం సుధీర్ణ చాలా మిస్ అవుతున్నాను అంటూ ఎన్నో సందర్భాలలో బయటపెట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా సుదీర్ ను తాను ఎంతగా మిస్ అవుతున్నాను అనే విషయాన్ని చెప్పడమే కాకుండా సుధీర్ అంటే తనకు ఎంత ప్రేమ ఉంది అనే విషయాన్ని కూడా రష్మీ బయటపెట్టారు.
Anchor Rashmi: సుధీర్ కంపెనీ బాగుంటుంది
ఈ సందర్భంగా రష్మీ నటుడు బ్రహ్మాజీతో కలిసి ఓంకార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సిక్స్త్ సెన్స్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె బ్రహ్మాజీతో కలిసి పెద్ద ఎత్తున హంగామా చేశారు. అనంతరం ఓంకార్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అయితే ఈయన మాత్రం రశ్మిని ఓ చిక్కుముడి వేసే ప్రశ్న వేశారు. ఈ సందర్భంగా ఓంకార రష్మిని ప్రశ్నిస్తూ ఒంటరిగా నువ్వు ఒకవేళ ఐలాండ్ లో ఉంటే నీకు తోడుగా ఎవరు ఉండాలని ఎవరైతే నీకు కంపెనీ ఇవ్వడానికి బాగుంటారని అనుకుంటున్నావు అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రష్మీ ఏకంగా సుధీర్ పేరు చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. తాను ఐలాండ్ లో ఒంటరిగా కనుక ఉంటే తనకు సుధీర్ కంపెనీ కావాలని, తాను తోడుంటే బాగుంటుంది అనుకుంటాను అంటూ కామెంట్స్ చేశారు. దీంతో రష్మీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.