Anchor Rashmi: జబర్దస్త్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈ ఒరిస్సా ముద్దుగుమ్మ వచ్చిరాని తెలుగు మాట్లాడుతూ అందర్నీ ఆకట్టుకుంటుంది. బుల్లితెరకు రాకముందు పలు చిత్రాల్లో నటించినా పెద్దగా పేరు సంపాదించని ఈ భామ బుల్లితెర మీద మాత్రం టాప్ యాంకర్ గా కొనసాగుతుంది. ఈమె షోల ద్వారానే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తరచుగా సందడి చేస్తూ ఉంటుంది.
ఈమె మంచి జంతు ప్రేమికురాలని మనందరికీ తెలిసిందే. ఈమె షోల ద్వారా ఎంత ప్రాముఖ్యత సంపాదించిందో తన బోల్డ్ స్టేట్మెంట్స్ తో, హాట్ డ్రెస్సింగ్ తో అంతే ప్రాముఖ్యత సంపాదించింది. అలాగే ఎవరైనా నెటిజన్స్ తనని విమర్శించినప్పుడు కూడా అంతే ఘాటుగా స్పందిస్తూ వాళ్లకి సరియైన సమాధానం చెబుతుంది. ఇప్పుడు అలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. లాక్ డౌన్ సమయంలో ఆమె వీధి కుక్కలకి ఫుడ్ పెట్టి తన గొప్ప మనసుని చాటుకుంది.
అలాగే వీధి కుక్కల పట్ల ఎవరైనా అమానుషంగా ప్రవర్తిస్తే ఊరుకోకుండా సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని ఘాటుగా చెప్తుంది. ఈ మధ్యనే హైదరాబాద్లో వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల చిన్నారి మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై స్పందించిన రష్మి దురదృష్టవశాత్తు తన తప్పు లేకపోయినా వీధి కుక్కల దాడిలో చనిపోవడం బాధని కలిగిస్తుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
అలాగే వాటికి బర్థ్ కంట్రోల్ వాక్సినేషన్ కూడా వేయించాలి. అవి మనలాంటి ప్రాణులే వాటికి కూడా సరియైన వసతి కల్పించడం మన బాధ్యత అంటూ ఒక ట్వీట్ వదిలింది ఈ యాంకర్. అయితే దీనిపై చాలామంది నెటిజన్స్ పాజిటివ్గా స్పందిస్తున్నారు. మరి కొంతమంది నెగటివ్గా స్పందిస్తున్నారు. అందులో ఒక నెటిజన్ ఈ రష్మీ కుక్కని, కుక్కని కొట్టినట్లు కొట్టాలి అంటూ దారుణంగా వ్యాఖ్యానించాడు.
Anchor Rashmi:
అయితే అందుకు రష్మీ కూడా డేరింగ్ గా ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ ఒక పోస్ట్ పెట్టింది. నీ అడ్రస్ ఎక్కడో చెప్పు నేనే పర్సనల్గా వస్తాను. ఏం చేస్తావో చూస్తాను ఇది నా ఓపెన్ ఛాలెంజ్ అంటూ ఘాటుగా స్పందించింది. ఈ పోస్ట్ కి సంబంధించిన ట్వీట్లు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. చూడాలి మరి నెటిజన్ రష్మీ కి ఎలాంటి రిప్లై ఇస్తాడో.