Anchor Ravi: టాలీవుడ్ ఇండస్ట్రీలో మేల్ యాంకర్లుగా గుర్తింపు పొందిన వారిలో రవి కూడా ఒకరు. మొదట మ్యూజిక్ ఛానల్లో యాంకర్ లాస్యతో కలిసి యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన రవి ఆ తర్వాత బుల్లితెర మీద ప్రసారమైన అనేక టీవీ షోలో సందడి చేస్తూ యాంకర్ గా బాగా ఫేమస్ అయ్యాడు. ఇలా తరచూ లాస్యతో కలిసి యాంకరింగ్ చేయటంతో వారు రిలేషన్ లో ఉన్నారని, ఇద్దరు కూడా పెళ్లి చేసుకుంటారని గతంలో వార్తలు వినిపించారు. కానీ అప్పటికే రవికి పెళ్లి జరిగి ఒక కూతురు కూడా ఉంది. కానీ రవి మాత్రం తన పెళ్లి విషయాన్ని రహస్యంగా ఉంచి యాంకర్ గా కొనసాగుతూనే ఉన్నాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి తన పెళ్లిని రహస్యంగా ఉంచడానికి గల కారణం గురించి వివరించాడు.ఈ ఇంటర్వ్యూలో రవి మాట్లాడుతూ… తన ఉద్దేశంలో పెళ్లి చేసుకున్న వారంతా కూడా అంకుల్స్ అని తన మైండ్ లో బలంగా నాటుకు పోయిందని తెలిపారు. ఒకవేళ తనకు పెళ్లి జరిగిన విషయం తెలిస్తే తనకు ఉన్న ఫాలోయింగ్ తగ్గిపోతుందని, అలాగే పెళ్ళి జరిగిన వారికి ఇండస్ట్రీలో అవకాశాలు కూడా రాకుండా పోతాయని భావించి తనకు పెళ్ళి జరిగిన విషయాన్ని రహస్యంగా ఉంచానని రవి తెలిపారు. కేవల తన కెరీర్ కోసమే తన భార్యని దాచి ఉంచానని రవి చెప్పుకొచ్చాడు.
Anchor Ravi: అవకాశాల కోసమే పెళ్లి విషయాన్ని దాచారా…
అయితే ఇలా తన పెళ్లి విషయాన్ని దాచి పెట్టడంతో తను ఎవరితో కలిసి యాంకరింగ్ చేసిన వారితో తనకు లింక్ పెడుతూ వార్తలు రావడంతో ఆ వార్తలకు చెక్ పెట్టడానికి గతంలోనే నిత్య( Nitya )తో తనకు పెళ్లి జరిగిన విషయాన్ని బయట పెట్టామని రవి ఈ సందర్భంగా తన పెళ్లి విషయం గురించి వెల్లడించాడు. ఇక ప్రస్తుతం రవికి ఇండస్ట్రీలో అవకాశాలు పూర్తిగా తగ్గాయి. బిగ్ బాస్ రియాలిటీ షో నుండి ఎలిమినేట్ అయిన తర్వాత రవికి మంచి అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. కానీ అందుకు విరుద్ధంగా బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత రవికి అవకాశాలు బాగా తగ్గిపోయాయి.