Anchor Shyamala నితిన్ హీరో గా నటిస్తున్న చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఇందులో రాను రాను అంటూనే చిన్నదో పాటకు అంజలి నితిన్ జంటగా స్తెప్పులేసి ఇరగదీశారు. ప్రస్తుతం ఈ పాట ఎంత ట్రెండ్‌లో వుండే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి మాస్ బీట్ తో సాగే ఈ సాంగ్ కి ఇప్పటికే చాలా మంది రీల్స్ చేసి అలరించారు.. ఇదే జాబితాలో చేరింది యాంకర్ శ్యామల.
పొట్టి గౌన్ లో అందాలు ఆరబోస్తూ శ్యామల చేసిన ఈ డాన్స్ కి ప్రస్తుతం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సూపర్ అమ్మడు అంటూ తెగ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. యాంకరింగ్, యాక్టింగ్, వంటల ప్రోగ్రామ్ లతో కొన్నాళ్ళు మంచి బిజీ బిజీ గానే గడిపిన శ్యామల.. బిగ్ బాస్ షోలో అలరించింది. రెండో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన శ్యామల మధ్యలోనే బయటకు వచ్చి.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. కాకపోతే విన్ అయితే మాత్రం కాలేకపోయింది. ఏమైనా శ్యామలకు బిగ్ బాస్ అంతగా ఉపయోగపడలేదు అనే చెప్పొచ్చు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్న ఈ భామ యూట్యూబ్ , ఇన్ స్టాగ్రాంలలో వీడియోలు పెడుతూ అభిమానులను అలరిస్తోంది.
సినిమాలలో అంతగా అలరించకపోయినా బుల్లి తెరపై మాత్రం తనదైన ముద్ర వేసింది ఈ బ్యూటీ. పెళ్లై, పిల్లలున్న ఇప్పటికీ తన అందంతో సోషల్ మీడియను ఒక ఊపు ఊపెస్తుంది. సొంత యూట్యూబ్ చానెల్‌లో ఆమె చేసే వీడియోలకు లైక్ లు కూడా బాగానే వస్తున్నాయి. తన పర్సనల్ విషయాలు, వంటింటి సంగతులు ఎక్కువగా షేర్ చేసుకుంటూనే మంచిగా సంపాదిస్తుంది. రీసెంట్ గా పల్లెటూరి వాతావరణం వుట్టి పడేలా సిటీలో వున్న తన ఇంటిని చూపిస్తూ శ్యామల చేసిన ఒక వీడియో యూట్యూబ్ తెగ వైరల్ అయింది. తన ఇంటిని చూసి ఔరా అని అనటమే కాదు.. ఇన్నాళ్లు బాగానే వెనకేసిందని కామెంట్ల పెడుతున్నారు. కొన్నాళ్ళ క్రితం కొన్ని వివాదాల్లో చిక్కుకున్నప్పటికి వాటి నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం తన కెరీర్ ను ఐతే బాగానే కొనసాగిస్తుంది.
https://www.instagram.com/reel/CgqZN23DuWp/?igshid=MDJmNzVkMjY=