Anchor Shyamala: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు వరుస బుల్లితెర కార్యక్రమాలు సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉన్నటువంటి శ్యామల ఈ మధ్యకాలంలో కాస్త అవకాశాలు తగ్గిపోయాయని చెప్పాలి. అడపాదడబా సినిమా కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నటువంటి ఈమె వ్యక్తిగతంగా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు సంబంధించిన విషయాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.
ఇలా నిత్యం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎంతో చేరువలో ఉన్నటువంటి శ్యామల తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.సోషల్ మీడియా వేదికగా తన భర్త కుమారుడితో కలిసి రెండవ ఇంటి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాలు చేసినట్లు ఈ ఫోటోలను షేర్ చేస్తూ తెలియజేశారు.ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేయగా మరి కొందరు మాత్రం ఈ ఫోటోలపై విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చూస్తున్నారు.
Anchor Shyamala: అంత డబ్బు ఎక్కదిడందీ….
ఈమె కొత్త ఇల్లు కట్టించి ఏడాది కూడా పూర్తి కాలేదు గత ఏడాది జులై నెలలో ఈమె గృహప్రవేశం చేసినట్లు తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఇంటికి సంబంధించిన వీడియోలను షేర్ చేశారు. అయితే ఇలా కొత్త ఇంట్లోకి చేరి ఏడాది కూడా కాకుండానే మరొక ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయడం ఎలా సాధ్యమవుతుంది.ప్రస్తుతం మీరు ఎలాంటి షోలు కూడా చేయడం లేదు కదా ఏదో తేడా కొడుతుంది అంటూ నేటిజన్స్ ఈ ఫోటోలపై కామెంట్లు చేస్తున్నారు.మామూలుగా సెలబ్రిటీలు ఇంటిని నిర్మించాలి అంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చవుతాయి అలాంటిది శ్యామల ఓకే ఏడాదిలోనే ఒక ఇంట్లోకి చేరి మరొక ఇంటి భూమి పూజ కార్యక్రమాలు చేయడంతో ఈ ఫోటోల పై చాలా మంది విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.