Anchor Sreemukhi: ప్రస్తుతం టాలీవుడ్ బుల్లితెరపై ఎనర్జిటిక్ యాంకర్ గా దూసుకుపోతున్న హాట్ బ్యూటీ శ్రీముఖి. ఏ ఛానల్లో చూసినా శ్రీముఖి సందడి బాగా కనిపిస్తూ ఉంది. తీరిక లేకుండా వరుస షోలతో బాగా బిజీగా మారింది. తొలిసారిగా అదుర్స్ షో తో అడుగుపెట్టిన శ్రీముఖికి బుల్లితెర బాగా కలిసి వచ్చింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వరుసగా చాలా షో లలో, సినిమా ఈవెంట్లలో, బుల్లితెర ఈవెంట్లలో హంగామా చేస్తూ వచ్చింది. మధ్యలో బిగ్ బాస్ షో లో కూడా పాల్గొని తన ఆటతీరుతో అందరినీ ఆకట్టుకుంది.
ఇక ఎంత తీరికలేని సమయంలో ఉన్నా కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఇక వెండితెరపై కూడా పలు సినిమాలలో చేయగా అక్కడ కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇక అప్పుడప్పుడు ఈమె షోలో పాల్గొన్న తోటి ఆర్టిస్టులను కూడా బాగా టార్గెట్ చేస్తూ ఉంటుంది. తన మాటలతో వారిని నోరు మూసేలా చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ముక్కు అవినాష్ బాగా టార్గెట్ చేసింది శ్రీముఖి.
ఇంతకు అసలు విషయం ఏంటంటే.. తాజాగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో బ్రహ్మముడి, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ టీం పాల్గొని బాగా సందడి చేసినట్లు కనిపించారు. ఇక అందులో బ్రహ్మముడి నటి తో ముక్కు అవినాష్ కాస్త సరదాగా ఆట పట్టిస్తూ ఉండగా.. వెంటనే శ్రీముఖి ఆ నటి తో ఇటువంటి జఫ్ఫా క్యారెక్టర్ ని మీ తమిళంలో చూసావా అంటూ ముక్కు అవినాష్ ని అవమానపరిచింది.
Anchor Sreemukhi:
తర్వాత కూడా మధ్య మధ్యలో అవినాష్ పై బాగా కౌంటర్లు వేస్తూ కనిపించింది. అయితే ఇదంతా కేవలం సరదా కోసమా మాత్రమే అని తెలుస్తుంది. మధ్యలో కమెడియన్ ఫైమా కూడా తన మాటలతో తెగ నవ్వించేసింది. ప్రస్తుతం ఆ ప్రోమో బాగా వైరల్ అవుతుంది.