Anchor Sreemukhi: ప్రస్తుతం టాలీవుడ్ బుల్లితెరపై శ్రీముఖి యాంకర్ గా ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది. ఏ ఛానల్ లో చూసిన కూడా తన హవానే నడుస్తుంది. అదుర్స్ షో ద్వారా తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీముఖికి బుల్లితెర బాగా కలిసి వచ్చింది. యాంకర్ గా వరుసగా చాలా షో లలో చేసింది. చేస్తుంది కూడా. అంతే కాకుండా వెండితెరపై కూడా పలు సినిమాలలో సైడ్ ఆర్టిస్టుగా చేసింది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తనకు సంబంధించిన ఫోటోలను బాగా షేర్ చేస్తూ ఉంటుంది. ఇక శ్రీముఖి చూడ్డానికి లావుగా ఉన్నప్పటికీ కూడా చాలా క్యూట్ గా ఉంటుంది. లావుగా ఉన్నప్పటికీ కూడా బాగా గ్లామర్ గా తయారవుతూ తన అందాలతో బాగా పిచ్చెక్కిస్తుంది. ఇక ఈమెకు బుల్లితెరపై మంచి అభిమానం ఉంది. సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
తనకు ఖాళీ సమయం దొరికితే మాత్రం తన ఫాలోవర్స్ తో బాగా ముచ్చట్లు పెడితే సందడి చేస్తుంది. శ్రీముఖి సోషల్ మీడియాలోనే కాకుండా షోలల్లో కూడా బాగా ట్రోలింగ్స్ వస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా సరదాగా లైట్ తీసుకుంటుంది. అయితే తాజాగా తాను యాంకర్ గా చేస్తున్న బిబి జోడీలో కూడా తనకు మరోసారి ట్రోల్ ఎదురయ్యింది. తాజాగా బిబి జోడి కి సంబంధించిన ప్రోమో విడుదలయ్యింది.
Anchor Sreemukhi: శ్రీముఖిని ఆ మాట అనేసిన అర్జున్..
అందులో అర్జున్, వాసంతి తమ పర్ఫామెన్స్ తో అదరగొట్టిన తర్వాత శ్రీముఖి అర్జున్ కి ఒక టాస్క్ ఇచ్చింది. నలుగురు చేయి పట్టుకున్న తర్వాత అందులో వాసంతి చెయ్యి ఏదో చెప్పమని తెలిపింది. దాంతో శ్రీముఖి అర్జున్ కి తన చెయ్యి ఇవ్వగా.. ఈ చెయ్యి ఎవరిదో లావుగా ఉంది అంటూ.. ఎవరో అబ్బాయి ఉండొచ్చు అని అనటంతో అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు. అర్జున్ అన్న మాటకు శ్రీముఖి షాక్ అయింది. తర్వాత తను కూడా నవ్వుకుంది. ప్రస్తుతం ఆ ప్రోమో బాగా వైరల్ అవుతుంది.