Anchor Suma: టాలీవుడ్ బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్ బుల్లితెరపై ఇప్పటివరకు ఏ యాంకర్ సొంతం చేసుకొని గుర్తింపు సుమ సొంతం చేసుకుంది. కొన్ని సంవత్సరాలుగా బ్రేక్ లేకుండా యాంకర్ గా కొనసాగుతూనే ఉంది సుమ. వెండితెరపై కొన్ని సినిమాలలో సైడ్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది. కానీ ఆమెకు మాత్రం బుల్లితెరపైనే కలిసి వచ్చింది.
ఇప్పటికీ సుమ ఎన్నో షోలలో సందడి చేసింది. నిజానికి టాలీవుడ్ బుల్లితెరపై యాంకర్ గా ఈమె ఎనర్జీ చూస్తే మాత్రం ఆశ్చర్య పోవాల్సిందే. సుమ అప్పట్లో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. వయసు మీద పడుతున్న కూడా సుమలో ఎనర్జీ మాత్రం ఇంకా తగ్గలేదు అని చెప్పవచ్చు. కేవలం షోలల్లోనే కాకుండా సినిమా ఈవెంట్లలో, ఆడియో ఫంక్షన్స్ లలో, సెలబ్రెటీల ఇంటర్వ్యూలలో పాల్గొని బాగా సందడి చేస్తుంది.
ఇప్పటికీ సుమ బుల్లితెరపై కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఆమె క్యాష్ తో పాటు సినిమా ఈవెంట్లలో కూడా బాగా బిజీగా మారింది. అప్పుడప్పుడు ఏదైనా పండుగల సందర్భంగా వచ్చే ఈవెంట్లలో కూడా బాగా సందడి చేస్తుంది సుమ. అయితే ఇదంతా పక్కన పెడితే రానున్న కొత్త సంవత్సరం సందర్భంగా వేర్ ఇస్ ద పార్టీ అనే ఈవెంట్ ను నిర్వహించారు.
ఇక దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయింది. అందులో బుల్లితెర సెలబ్రెటీలు, సీరియల్ నటీనటులు పాల్గొని బాగా సందడి చేసినట్లు కనిపించారు. ఇక సుమ యాంకర్ గా చేయగా అందులో తను వేసిన కుళ్ళు జోకులు మాత్రం అందరిని తెగ నవ్వించాయి. అయితే ప్రోమో చివర్లో సుమకు అందరూ పూల దండలతో సన్మానించారు. ఈ సందర్భంగా.. సుమ కొన్ని విషయాలు పంచుకుంది.
Anchor Suma: కంటనీరు పెట్టుకున్న సుమ..
మలయాళీగా పుట్టినటువంటి తను ఇక్కడ సెటిల్ అయ్యాను అంటే కేవలం తెలుగు వాళ్ళు ఇచ్చిన అభిమానం, ప్రేమ అంటూ ఎమోషనల్ గా మాట్లాడింది. ఇక తను కొంత విరామం తీసుకోవాలి అనుకుంటున్నాను అంటూ అందరికీ షాక్ ఇచ్చింది సుమ. అంతేకాకుండా కంటనీరు పెట్టుకున్నట్లు కూడా కనిపించింది. ప్రస్తుతం ఈ ప్రోమో చూసిన వాళ్లంతా విరామం తీసుకోవడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు.