Anchor Suma: పనిమనిషితో అలా చేయించుకుంటున్న యాంకర్ సుమ.. నెట్టింట్లో వీడియో వైరల్!

Akashavani

Anchor Suma: తెలుగు రాష్ట్రాల ప్రజలకు యాంకర్ సుమ కనకాల గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెర పై మకుటంలేని మహారాణి ఈమె. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా.. తన మాటలతో అందర్నీ ఆకట్టుకోవడం తనలోని ప్రత్యేకత. టెలివిజన్ ప్రేక్షకులలో సుమ అంటే తెలియని వారుండరు.

దూరదర్శన్ లో సీరియల్ ద్వారా బుల్లి తెరకు పరిచయమై.. ప్రస్తుతం యాంకర్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక రేంజ్ లో హడావిడి చేస్తోంది. ఇక ఇటీవల ఒక సినిమాకు కు కూడా శ్రీకారం చుట్టింది. ఆ సినిమా మరేదో కాదు జయమ్మ పంచాయతీ. ఈ సినిమాలో సుమ మెయిన్ రోల్ చేస్తుంది. కాగా సుమ ఈ సినిమా తో సక్సెస్ సాధించడానికి ప్రమోషన్ల నేపథ్యంలో బాగానే కష్టపడుతుంది.

ఇక ప్రమోషన్లను పెద్ద పెద్ద స్టార్ హీరోలు చేతుల మీదగా ప్రమోట్ చేపిస్తూ.. సినిమాను ఏదోవిధంగా గట్టేక్కించే ప్రయత్నంలో ఉంది. ఇక ఇలా ప్రమోషన్ల కోసం బాగా కష్టపడుతున్న సుమ గత కొన్ని రోజులుగా టూర్ ల మీద టూర్లు వేస్తుంది. ఇక సుమ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంది. ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటుంది.

Anchor Suma: సుమ తన పని మనిషితో చేయించుకున్న పని ఇదే!

ఇక సుమ షేర్ చేసే పోస్టుల లో తన పని మనిషి కూడా కనిపిస్తుంది. కుదిరినప్పుడల్లా తన గురించి కూడా చెబుతుంది. సుమ ఆ పని మనిషిని ఎప్పుడు ఆటపట్టిస్తూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ ఉంటుంది. ఇక తాజాగా సుమకు తన పనిమనిషి మసాజ్ చేస్తుంది. నా తలలో అంతా సినిమా ప్రమోషన్ లే ఉన్నాయి.

నువ్వు ఇలా మసాజ్ చేస్తే కొంచెం అయినా రిలాక్స్ అవుతాను అంటూ సుమ చిల్ అవుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -