Anchor Suma:సుమ కనకాల పరిచయం అవసరం లేని పేరు బుల్లితెర యాంకర్ గా నెంబర్ వన్ స్థానంలో గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ ఏక చక్రాధిపత్యం వహిస్తున్న సుమ ఇప్పటికీ వరుస సినిమా ఈవెంట్లతో ఇతర కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. సుమ ఒక కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది అంటే ఆ కార్యక్రమానికి అత్యధిక రేటింగ్ వస్తుందని చెప్పాలి సినిమా ఈవెంట్లకు ఈమె హోస్ట్ గా వ్యవహరిస్తే సినిమాకు మరింత ప్రమోషన్ అయినట్టు ఉంటుందని మేకర్స్ యాంకర్ గా తీసుకోవడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు.
ఇలా వృత్తిపరమైన జీవితంలో సుమా ఎంతో బిజీగా గడుపుతూ భారీగానే సంపాదిస్తున్నారని చెప్పాలి. ఇలా ఈమె యాంకరింగ్ మాత్రమే కాకుండా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియా వేదికగా సుమ తరచు తణుకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా కొన్ని ప్రమోషన్ యాడ్స్ కూడా చేస్తూ భారీగా డబ్బు సంపాదిస్తున్నారు.ఇలా ఈమె చేసే వీడియోలలో తన కుటుంబ సభ్యులు తన ఇంట్లో పని వాళ్లు కూడా భాగమవుతూ ఉంటారు.
Anchor Suma: ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్న సుమ…
అయితే తాజాగా ఈమె తన భర్త రాజీవ్ కనకాలతో కలిసి కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ ను, పచ్చళ్ళు..ప్రమోట్ చేస్తూ ఓ యాడ్ చేసింది. అయితే సుమ ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ ను ప్రమోట్ చేయడంతో ఈ ప్రొడక్ట్స్ గురించి జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఆల్రెడీ ఈ ప్రొడక్ట్స్ తాము ఉపయోగించామని ప్రొడక్ట్స్ నాసిరకంగా ఉన్నాయని, పెద్దగా రుచి కూడా లేవని,అలాగే అవి డెలివరీ అయ్యే లోపు పాడవుతున్నాయి అంటూ పెద్ద ఎత్తున నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇలా రుచికరంగా లేని వాటిని కూడా ప్రమోట్ చేస్తూ అడ్డంగా దొరికిపోవడంతో నేటిజన్స్ ఇప్పటివరకు యాంకరింగ్ చేస్తూ భారీగానే సంపాదించావు కదా సుమక్క మరి డబ్బు కోసం ఇలాంటి ఫుడ్ ప్రాడక్ట్స్ ప్రమోట్ చేయడం అవసరమా అంటూ భారీగా ట్రోల్ చేస్తున్నారు.