Anchor Suma: బుల్లితెర లో టాప్ యాంకర్ లలో మొదటి స్థానంలో ఉన్న యాంకర్ సుమ. సుమ కేవలం యాంకర్ గానే కాకుండా ప్రస్తుతం యాక్టర్ గా కూడా చేస్తుంది. ఇటీవల ఆమె జయమ్మ పంచాయితీ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది.
అయితే ఈ సినిమాలో సుమ నటనకు గాను మంచి ప్రశంసలు అందుకుంది. సినిమాలో ఎంతో అద్భుతంగా నటించి పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇక సుమ యాంకరింగ్ విషయానికి వస్తే.. షో లు, ఈవెంట్లు, ప్రోగ్రామ్స్, ఆడియో రిలీజ్, ప్రీ రిలీజ్ అంటూ ఇలా అన్నిటిలో సుమనే యాంకర్ గా కనిపిస్తోంది. ఈమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
మహిళల్లో ఈమెకు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక సుమ యాంకరింగ్ చేస్తున్న ఈటీవీ షోలలో క్యాష్ షో ఒకటి. ఈ షో చాలా ఏళ్లుగా ఈ షో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అల్లరిస్తోంది. ఈటీవీలో ప్రతి శనివారం ఈ షో ప్రసారమవుతుంది. అయితే ఇందులో వారం వారం కొత్త సెలబ్రెటీలు సందడి చేస్తూ ఉంటారు.
అయితే ఈ షోకు బాలీవుడ్ కి చెందిన రన్ బీర్ కపూర్, ఆలియా భట్ రావడం విశేషం. వీళ్ళ రాకతో ఈ షో బాలీవుడ్ కి కూడా చేరుకుంటుందని చెప్పక తప్పదు. ఇదిలా ఉండగా రాబోయే ఎపిసోడ్ కి సంబంధించి క్యాష్ నిర్వాహకులు కొత్త ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ శ్రీను, హేమ, ప్రవీణ్, హరితేజ పాల్గొన్నారు.
ప్రోమో మొత్తంలో వీరందరూ హుషారుగా ఒకరిపై ఒకరు పంచులు వేసుకుంటూ కనిపించారు. వీరు వేసుకున్న కామెడీ పంచులతో కామెడీ బాగా పండింది. అంతేకాకుండా యాంకర్ సుమ వీరందరికి ఒక్కొక్కరిగా పనిష్మెంట్ ఇచ్చి కంటెంట్ ను రాబట్టింది. ఇక ఇదంతా పక్కన పెడితే.. ప్రోమో చివరికి వచ్చేసరికి ఓ కుర్రాడు యాంకర్ సుమకి ప్రపోజ్ చేశాడు. ఇది ప్రోమో మొత్తానికి హైలైట్ గా నిలిచింది.
Anchor Suma: యాంకర్ సుమకు ప్రపోజ్ చేసిన కుర్రాడు..
అయితే కమెడియన్ ప్రవీణ్ డైరెక్షన్ చేస్తూ.. పార్క్ లో ఒక అమ్మాయిని లవ్ ప్రపోజ్ చేయాలని ఆడియన్స్ లలో ఉన్న ఓ అబ్బాయిని రప్పించాడు. ఆ అబ్బాయికి ఓ గులాబీ ఇచ్చి అమ్మాయి స్థానంలో సుమను నిలబెట్టి ప్రపోజ్ చేయమనగా ఆ అబ్బాయి వెళ్లి సుమ ఐ లవ్ యు అని చెప్పాడు. దీంతో సుమ.. నువ్వు మా అబ్బాయి క్లాస్మేట్ కదా?.. అని అతనిపై సెటైర్ వేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది.