Anchor Suma: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా, ఎనర్జిటిక్ యాంకర్ గా దూసుకుపోతుంది సుమ. ఎక్కడ చూసినా యాంకర్ గా సుమకే క్రేజ్ ఉంది. సినిమా ఈవెంట్లలో, ఎంటర్టైన్మెంట్ షో లలో, ఇంటర్వ్యూలలో అలా ఎటు చూసినా కూడా సుమనే కనిపిస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుగు బుల్లితెరను బాగా ఏలుతుంది సుమ.
ముందు తరం ప్రేక్షకులకే కాకుండా ఈ తరం ప్రేక్షకులకు కూడా సుమ గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఇప్పటివరకు బుల్లితెరపై చాలా షో లలో చేసింది. స్టార్ మహిళ షో తో మాత్రం మంచి రికార్డు సొంతం చేసుకుంది. ప్రస్తుతం క్యాష్ షో తో పాటు సినిమా ఈవెంట్లలో, ఇంటర్వ్యూలలో బాగా బిజీగా ఉంది. అప్పుడప్పుడు ఇతర ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గొని బాగా సందడి చేస్తుంది.
అయితే మొన్న న్యూ ఇయర్ రోజు వేర్ ఇస్ ద పార్టీ ప్రోగ్రాంలో చివర్లో యాంకర్ గా విరామం తీసుకుంటాను అంటూ ఆ తర్వాత ఈ ఏడాది మాత్రమే అంటూ మరోసారి తన కుళ్ళు జోకుతో నవ్వించింది. వచ్చే ఏడాది అంటే ఈ సంవత్సరంలో కొత్త ప్రోగ్రాం తో వస్తున్నాను అని సుమ అడ్డ అని అనౌన్స్ చేసింది. తాజాగా దానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా అందులో సిని సెలెబ్రెటీలను ఇంటర్వ్యూ చేసినట్లు కనిపించింది.
Anchor Suma: సుమను బ్రేక్ తీసుకోమంటున్న నెటిజన్..
అయితే ఇందులో కూడా సుమ యాంకర్ గా కనిపించడంతో చాలా మంది సుమ ఎనర్జీని పొగుడుతున్నారు. అయితే ఓ నెటిజన్.. కొత్త యాంకర్లకు అవకాశం రావాలి, వాళ్ళు నేర్చుకోవాలి అంటే మన సుమ గారు కొంచెం బ్రేక్ తీసుకోవాలి అంటూ సలహా ఇచ్చారు. అంటే కొత్త యాంకర్లకు సుమ అడ్డుగా ఉంది అని చెప్పకనే చెప్పారు. ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.