Anchor Suma: టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ యాంకర్ అనగానే మొదటగా గుర్తొచ్చే పేరు సుమ. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫిమేల్ యాంకర్స్ లో స్టార్ యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో టీవీ షోలలో యాంకరింగ్ చేస్తూ తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సుమ నటిగా కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇక ప్రస్తుతం టీవీ షోలను తగ్గించి సోషల్ మీడియా మీద దృష్టి పెట్టింది. అందరి సెలబ్రిటీల లాగే సుమా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సుమ తరచు తన షూటింగ్ కి సంబంధించిన విషయాలతో పాటు వివిధ రకాల వంటలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ లో కూడా ఫన్నీ రియల్ చేస్తూ ప్రజలను కడుపుబ్బ నవ్విస్తూ ఆకట్టుకుంటుంది. షూటింగ్ సమయంలో జరిగే సరదా సన్నివేశాలు మేకప్ గురించి అభిమానులతో పంచుకోవడమే కాకుండా తన టీం తో కలిసి రీల్స్ చేస్తూ ఉంటుంది. ఇలా ఇంస్టాగ్రామ్ లో సుమ షేర్ చేసే ఫన్నీ రీల్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఇంస్టాగ్రామ్ లో సుమ షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. సాధారణంగా శని ఆదివారం సెలవు తీసుకుని సోమవారం ఆఫీసుకు వెళ్లి పని చేయటానికి చాలామందికి బాధగా ఉంటుంది. ఈ విషయం గురించి చెబుతూ సుమా చేసిన ఫన్నీ రీల్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Anchor Sumaమా ఫీలింగ్ కూడా అదే సుమక్క…
ఈ వీడియోలో సుమ చిన్న పిల్లలా నేను షూటింగ్ కి రాను అంటూ మారాం చేసింది. సోమవారం షూటింగ్ కి వెళ్ళటం ఇష్టం లేదని , నేను రాను అంటూ ఏడుస్తూ మారాం చేసింది. ఇలా ఈ వీడియోలో సుమ చిన్న పిల్లలాగా మారాం చేయటం, అంతే కాకుండా నెత్తిన గుడ్డ వేసుకోవడం నెటిజన్లకు బాగా నవ్వు తెప్పిస్తోంది. ఈ వీడియో చూసినా నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు వేస్తున్నారు. మీ కామెడీ టైమింగ్ సూపర్, మీ వీడియోస్ చుస్తే చాలా రిలాక్స్ గా ఉంటుంది, మండే ఆఫీసు అంటే మా ఫీలింగ్ కూడా అదే అంటూ ఇలా వివిధ రకాలుగా కామెంట్లు పెట్టేస్తున్నారు. మొత్తానికి సుమ ఏం షేర్ చేసినా కూడా నిమిషాలలో వైరల్ అవుతూ ఉంటుంది.