Varshini: సినీ నటి, యాంకర్ వర్షిణి మొదటిగా బుల్లితెరపై ప్రసారమైన పటాస్ షో లో యాంకర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టింది. అలా మెల్లిమెల్లిగా బుల్లితెరపై కొన్ని కార్యక్రమాలలో యాంకర్ గా అవకాశాలు వచ్చాయి.
ఇక ఈటీవీలో ప్రసారమవుతున్న డాన్స్ షో అయినా ఢీ లో కూడా చేయగా అక్కడ కూడా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆమె నిదానంగా అవకాశాలు అందుకుంటూ చాలా తక్కువ షో లలోనే కనిపించేది. ఆ తర్వాత చందమామ కథలు సినిమాలో నటించి తెలుగు సినిమాలలోకి అడుగు పెట్టింది.
ఈ సినిమా తర్వాత ఈమెకు కొన్ని సినిమాలలో నటించే అవకాశం కూడా వచ్చింది. అలా ఆమె సినిమాల్లో కొన్ని కీలకమైన పాత్రలు పోషించింది. అలా ఆమెకు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహించిన పెళ్లి గోల వెబ్ సిరీస్ లో హీరోయిన్గా అవకాశం దక్కింది.
ఈ వెబ్ సిరీస్ లో హీరోగా అభిజిత్ నటించాడు. అయితే ఈ భామ సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తన అందాలతో కుర్రకారును పిచ్చెక్కించే ఫోటోషూట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
ఈమె అందచందాలకు సోషల్ మీడియాలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. తన అందం, అభినయంతో చాలామంది అభిమానులను సంపాదించుకుంది. అయితే ఇన్ని గుణాలు ఉన్నా కూడా సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్గా అవకాశాలు మాత్రం రాలేదు.
అందువల్ల ఇప్పుడు పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలని వర్షిణి అనుకుంటుందట. అందుకే తన దగ్గర బంధువులైన తన బావను పెళ్లి చేసుకోబోతుందట. ఇక వర్షిణి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలాగే వారికి కోట్లలో ఆస్తులు కూడా ఉన్నాయని తెలిసింది.
Varshini: వచ్చే నెలలో వర్షిణి నిశ్చితార్థం..
మొదటి నుంచి ఒకరికొకరు ఇష్టపమట. ఇక సినిమాల్లో అవకాశాలు రాక వర్షిణి పెళ్లికి ఒకే చెప్పేసింది. ఈ నెల ఆఖరిలో వీరికి ఎంగేజ్మెంట్ జరుగుతున్నట్లు సమాచారం. అలాగే ఏడాదిలోపు పెళ్లి కూడా జరుగుతుందని తెలిసింది. ఇలా ఒక కోటీశ్వరుల ఇంటికి కోడలు కాబోతుందని వార్తలు గుస గుస లాడుతున్నాయి. అయితే ఈ వార్తలో ఉన్న నిజం ఎంతో తేలాల్సి ఉంది.