Anchor Vishnu Priya:పోవే పోరా కార్యక్రమం ద్వారా బుల్లితెర యాంకర్ గా పరిచయమైనటువంటి యాంకర్ విష్ణు ప్రియ అనంతరం బుల్లితెరపై పలు కార్యక్రమాలలో సందడి చేస్తూ వచ్చారు. ఈ కార్యక్రమాల ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం బుల్లితెరకు దూరమయ్యారు బుల్లితెరపై ఏ విధమైనటువంటి అవకాశాలు రాకపోవడంతో ప్రైవేట్ సాంగ్స్ చేస్తూ రచ్చ చేయడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
గత కొద్ది రోజుల క్రితం విష్ణు ప్రియ తల్లి గారు మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా తన తల్లి మరణాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. అయితే తాజాగా ఈటీవీ మదర్స్ డే సందర్భంగా ప్రియమైన అమ్మకు అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈటీవీతో సంబంధం ఉన్నటువంటి వారందరినీ కూడా ఆహ్వానించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ కార్యక్రమంలో భాగంగా నూకరాజు రాకింగ్ రాకేష్ చేసిన స్కిట్ అందరి చేత కంటతడి పెట్టించింది.
Anchor Vishnu Priya: ఐ మిస్ యు అమ్మ..
ఈ స్కిట్ చూసినటువంటి విష్ణు ప్రియ తన తల్లిని తలుచుకొని ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలోనే వేదిక పైకి వెళ్లి తన తల్లిని గుర్తు చేసుకుంటూ వచ్చే జన్మంటూ ఉంటే నీ కూతురిగా నీ కడుపున పుట్టాలి ఐలవ్యూ అమ్మ మిస్ యు సో మచ్ అంటూ విష్ణు ప్రియ కంటతడి పెట్టుకున్నారు. ఇలా ఈమె తన తల్లిని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకోవడంతో అక్కడున్నటువంటి వారందరూ కూడా పెద్ద ఎత్తున ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.