Vishnupriya : తెలుగులో పలు షోలు మరియు యాంకరింగ్ నిర్వహించి ప్రేక్షకులను బాగానే అలరించిన యంగ్ బ్యూటిఫుల్ యాంకర్ విష్ణుప్రియ భీమినేని గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే నటి విష్ణుప్రియ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హీరోయిన్ అవ్వాలని చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కానీ అవేవీ ఫలించలేదు. దీంతో యాంకరింగ్ రంగంలో అడుగుపెట్టి బాగానే క్లిక్ అయింది. కానీ సినిమాలపై మనసు చావకపోవడంతో ఇప్పటికీ పలు రకాల ఫోటోషూట్లు, ఆడిషన్స్ అంటూ బిజీ బిజీగా గడుపుతో ఆఫర్ల కోసం బాగానే కష్టపడుతోంది.
అలాగే ఈ మధ్యకాలంలో యాంకర్ విష్ణుప్రియ సోషల్ మీడియా మధ్యన బాగానే యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన అందమైన ఫోటోలు ఇలాంటివి షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే సంపాదించుకుంది. ఈ క్రమంలో ఈ అమ్మడికి ప్రస్తుతం సోషల్ మీడియా ఖాతాల అన్నింటిలోనూ దాదాపుగా ఐదు లక్షల పై చిలుకు నెటిజన్లు ఫాలో అవుతున్నారు.
అయితే తాజాగా యాంకర్ విష్ణు ప్రియ సోషల్ మీడియా ఖాతా అయిన ఫేస్బుక్ లో కొన్ని అశ్లీల చిత్రాలు మరియు నగ్న సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఒక్కసారిగా విష్ణు ప్రియ అభిమానులు అవాక్కయ్యారు. దీంతో ఇది గమనించిన విష్ణు ప్రియ వెంటనే తన ఇతర అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా స్పందిస్తూ తన ఫేస్బుక్ కాదా అకౌంట్ హ్యాక్ అయిందని కాబట్టి కొన్ని రోజులపాటు తన ఫేస్బుక్ ఖాతాని అన్ ఫాలో చేయమని కోరింది.
కొందరు కావాలని తన సోషల్ మీడియా మాధ్యమాలను టార్గెట్ చేస్తున్నారని వాపోయింది. అయితే ఇలా నటి విష్ణుప్రియ ఫేస్బుక్ ఖాతా హ్యాక్ అవడం కొత్తేమీ కాదు. గతంలో కూడా పలుమార్లు ఇలానే జరిగింది. దీంతో కొందరు నెటిజన్లు నటి విష్ణుప్రియ భీమినేని ఫేస్బుక్ ఖాతాలను హ్యాండిల్ చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరో మారు ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని లేకపోతే ఫాలోవర్స్ తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నటి మరి యాంకర్ విష్ణుప్రియ భీమనేని తెలుగు ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ మరియు జరిగే పంచ కట్టే అనే పాటలు నటించింది. కాగా ఈ పాట దాదాపుగా కోటికి పైగా వ్యూస్ ని దక్కించుకొని ప్రేక్షకులను బాగానే అలరించింది.