Anirudh Ravichandran: అనిరుద్ రవిచంద్రన్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ పేరే వినపడుతుంది.తమిళ తెలుగు భాష అంటూ ఎలాంటి భేదాలు లేకుండా అన్ని భాష చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందిస్తూ తన మ్యూజిక్ తో అందరిని మ్యాజిక్ చేస్తున్నారు. ఇలా ఈయన సంగీత సారథ్యంలో వస్తున్నటువంటి సినిమాలో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈయన కోసం ఎదురుచూసే దర్శకనిర్మాతల సంఖ్య కూడా పెరిగిపోతుంది అయితే ఈయనకు సమయం లేకపోయినప్పటికీ కాస్త లేట్ అయిన పరవాలేదు అని ఈ యంగ్ డైరెక్టర్ కోసం దర్శక నిర్మాతలు ఎదురుచూస్తున్నారు.
తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమా మ్యూజికల్ గా కూడా చాలా సెన్సేషనల్ హిట్ అందుకుంది.ఈ సినిమా సక్సెస్ కావడంతో ఈయన కోసం ఎదురుచూసే దర్శక నిర్మాతల సంఖ్య కూడా పెరిగిపోయిందని చెప్పాలి.ఇలా ఏమాత్రం తీరిక లేకుండా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి అనిరుద్ ఒక్కో సినిమాకు భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈయనకు డిమాండ్ పెరగడంతో రెమ్యూనరేషన్ విషయంలో కూడా భారీగానే డిమాండ్ చేస్తున్నారట.
Anirudh Ravichandran: స్టార్ హీరోల సినిమాలతో బిజీ…
ఈయన ఒక్కో సినిమాకు సుమారు 8 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇలా ఒక్క సినిమాకు 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఇకపోతే ప్రస్తుతం ఈయన సంగీత సారథ్యంలో స్టార్ హీరోల సినిమాలు తెరకెక్కుతున్నాయని తెలుస్తుంది. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి దేవర సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తున్నారు అలాగే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాకి కూడా అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.